పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. బుట్టుబడి పెట్ట లే[1]మావిపొలఁతుకకును
జెట్లఁబడి పోకుమని బుద్ధి సెప్పుఁడమ్మ
తేఁటి మధుపాని యౌటెల్లఁ దేట మనరుఁ
దరుణిఁ గాపాడి నడువుఁడీ తల్లులార. 125

సీ. కాపుండు నెలమావి గండుకోయిలపిండు
పోనీకుఁ డచటి కంభోజమునిని
గురివెంద[2]పొదరింటఁ గొదమతుమ్మెద యుండు[3]
విందానఁ జననీకుఁ డందు సఖిని
బసుఁబొన్న రతిమనోభవుఁడు గాపురమున్న
నెల వేఁదనీకుఁడీ నెలఁత నచటి
కంచ లుండెడికందు వంబుజాకర మందు
విహరింప బాలఁ బోవిడువ కుండుఁ
ఆ. డిందువదన మీకు నిల్లడ సుండమ్మ
యనుచు నప్పగించి యవ్వయస్య
గొంద ఱిందుముఖులఁ గొరలి చేఁదోడుగాఁ
గొని రహస్యసౌధమునకు నరిగి.

ఉ. ఆ దళదబ్జలోచన ప్రయత్నమునం గమనీయనీలపీ
తాదిగుణంబులం గడు సమగ్రముగా సమకూర్చి కౌశల
శ్రీ దిలకింపఁ జారుతరచిత్రపటంబున వ్రాస దేవధా
త్రీదయితాహివర్యుల సుదీర్ణవయోగుణరూపధుర్యులన్.

మృగావతికిఁ బ్రియసఖి వివిధ పురుషవరేణ్యుల చిత్రపటంబులు చూపుట


ఆ. వ్రాసి క్షణంబ వనజాక్షి కుతుకాబ్ధి
పూర మంతరంగమునఁ దొలంక
నెమ్మి నృపతనూజ నిల్చిన పూఁ జప్ప
రంబుకడకు సత్వరముగ వచ్చి. 128

  1. సెట్టులే
  2. గురువింద
  3. యుండ్ద