పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. అని యనంతరంబ సఖీజనంబు నవలోకించి విరహిజనమారణకారణులైన కందర్పాదుల నిందించు తలంపున. 123

మదనదూషణాదికము


సీ. మరుని నీలుగఁ జోసి మగుడఁ జేయమి నాఁడు
మృడుని కెక్కడ తలమీఁదు వచ్చెఁ
గోయిలఁ గడముట్టఁ గూయుట మాన్పఁగా
మెద గట్టిరే రామమేదినీశు
విధు మ్రింగి క్రమ్మఱ వెడలింపకున్న నె
క్కడ రాహుమెడమీఁదఁ గత్తి వచ్చెఁ
జలిగాలు యెదతేరఁ జవిగొన్న[1] చిలువరా
కొమల కెక్కడ గ్రుడ్లకొలఁది యయ్యె
తే. ఛాందసముగాఁగ విధి పుష్పజాల మెల్ల
సంపఁగులుసేయ కళికేల జయమొనర్చె
నాఁడె నీ రెల్ల కొదమాన[2] నడచిరేని
వీనిచే నట్లు వడునమ్మ విరహిజనము. 124
 
సీ. తుహినాంశుఁ డెప్పుడు దోషాకరుం డౌట
తెలియరే[3] సతిఁ గాచి తిరుగుఁడమ్మ
మదనుఁ డెంతయు మంటలారౌ టెఱుఁగుదు
రువిదపైఁ గనుగల్గి యుండరమ్మ
చీరపేతమ్ము మిక్కిలి వావదూకని
మదినూఁది బాల నేమఱకుఁడమ్మ
పికము దాఁ బలుగాకిపిల్లౌట విన్నారె
యప్రమత్తతఁ బ్రోవుఁడమ్మ వమ్మ

  1. జలిగాలిఁ గొదతేరఁ జవిగొన్న
  2. కొడమాన
  3. తెలుతురే