పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. ఇబ్బోటి భావంబు నీటిలో ముల్లె యున్నయది[1] మదిరాక్షిలోని తలం పెవ్విధబుననైన నప్పువ్వుఁబోఁడినే యడిగి తెలియక యిట్లు మిన్నక మన యుల్లంబులం దల్లడిల్లనేల యని యల్లనల్లన నప్పల్లవాధర పల్లవశయ్యం జేరంజని నిజపాణిపల్లవంబునం దను వంటి యిమ్మచ్చెకంటి నుపలాలించుచు. 105
 
ఉ. తల్లి భవన్మనోరధము ధర్మమె దాఁచుట మాకు నిట్లు నీ
యుల్లము చందముం దెలియనోపమికై దురపిల్లుచున్న వా
రెల్ల సఖీజనంబులు మృగేక్షణ నీమదికోర్కిఁ జెప్పి మా
తల్లడ మెల్ల మాన్పి విదితంబుగఁ బుణ్యము త్రోవఁ బోవవే. 106

ఉ. కన్నులు విచ్చి మమ్ముఁ జెలికత్తెలఁ జూడఁగదమ్మ యమ్మ నీ
యున్నవిధంబుఁ గన్గొనిన నుల్లము పొక్కెడినమ్మ యిందులోఁ
గిన్నెరకంటి నీకుఁ బరికింప నమిత్రల మెవ్వరమ్మ నే
మెన్నఁటికమ్మ[2] మాయెడ మృగేక్షణ సిగ్గువడంగ నేటికే. 107

ఉ. మచ్చికచేసి యేపనికి మాటిడకుండుటసూవె నెచ్చెలుల్
వచ్చి బహుప్రకారముల వద్దఁ జరించుచు నున్నవారు వీ
రొచ్చల[3] నీవు విరి నొకయోవని వారలఁజేసి యీక్రియం
బొచ్చెపు వర నన్ మరలుబుద్ధులఁ బోయినఁ జేరవత్తు రే. 108

ఆ. నీ మనోరధంబు నెలఁత నా కెఱిఁగింపు
మెంత కార్య మైన నే ఘటింతు
నీకు నే ననుంగు నెచ్చెలి నుండ నీ
ప్రసవశరుని బారిఁ బడఁగఁ దగునె. 109

చ. అని బహురీతులం బ్రియవయస్య తనుం బలుకంగ లోలలో
చన కనుదోయి విచ్చి యలసంబుగ నెచ్చెలి యాననాబ్జముం
గనుఁగొని కంఠకాకలికగద్గదికం దగులంగ నొయ్య ని
ట్లను నయనాంబుపూరము లపాంగములన్ నిగుడంగ నూర్చుచున్. 110

  1. ఇజ్జోటి భావంబు నీటిలోని ముల్లై యున్నయది
  2. మెన్నటి కమ్మ
  3. నున్నవార లీషోచ్చల