పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

తే. నిన్నిటికిఁ (సతతంబు)[1] మా యిందువదన
ప్రాణములు గాచి రక్షింపు భావభవుని
నెఱుఁగ నే మెంతనాడు బాయుచువీరులు
సావడిని బేరుగలవాఁడ వనిన చైత్ర. 66
 
ఉ. ప్రాణుల యంతరంగ..... ప్రాణంబవై యుం.....చుంటన్ జగ
త్స్రాణుం........బేల నినుం బల్కుదు రం.....జనంభవాది గీ
ర్వాణులు నీకు నిట్టి గుణవంతునకుం దగునయ్య మాచెలిం
బ్రాణము లెత్తుకోలుగొను పాతకమున్ మదిఁ బట్టి కూర్పఁగన్[2]. 67
 
సీ. జననంబు చందనాచలమ నీ కబలపై
నకట వేఁడిమిచూప నర్హమగునె
ప్రాణంబవై యుండి ప్రాణికోటికి బాల
ప్రాణంబుపైయల్క[3] పాడియగునె
నియమ శాంతులలోన నిహితమైయుండుదు[4]
నలివేణియెడఁ గ్రోధి వగుట తగునె
యూరక యొకమూల నొదిగియుండెడి నీకు
నువిద నారడి బెట్టు టుచిత మగునె
తే. యెన్నివిధముల నీ విధం బెన్నిచూడ
లోకహితమయ్యు మా లోలలోచనకు న
హితము సేయుట సతిభాగ్య మేమి సెప్ప
జనహితాణాం దక్షిణాశాసమీర. 68

మ. కలశాంబోనిధి కూర్మిపట్టిని రమాకాంతాలలామంబు గా
దిలి సోదర్యుఁడ నద్రిజాపతి శిరోదీవ్యన్మరుద్రత్నకం
దళి వీ వంగము కేవలామృతసోదారంబు నీ కర్హమే
దళదిందీవరనేత్ర ని ట్లలఁపఁ జంద్రా యామినీవల్లభా. 69



  1. నిన్నిటికినిఁ (గడతరము)
  2. లెత్తుకో కొనుపాతకమున్మదిఁ బట్టుకొల్పఁగన్; లెత్తికొ కొనుపాతకమున్ మదిఁబట్టి కొల్పఁగన్
  3. ప్రాణంబుపె..ల్క
  4. నియత శాంతులలోన ని(లి)తమైయుండుదు