పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పొలుపొందు నగుమొగంబుల చక్కఁదనమున
నవజాతముల గౌరవం బెడల్చి
తేలుక్రొమ్మించు వాతెఱల చెల్వంబున
బంధుమీనముల బారిసమరి
తే. మొలకనవ్వుల బిబ్బోకములఁ గరంబు
విచ్చుకెందమ్మివిరులపైఁ బెచ్చు లుడిపి
లీలవర్తించునట్లు నాలీకముఖులు
సంభ్రమమున జలక్రీడ సల్పి రపుడు. 53

వ. అనంతరంబ— 54

సీ. ప్రథమంబునను జోపువడిన రాయంచల
గను బాహూబనములఁ గ్రమ్మఱింప
మును మీఁది కెగసిన మొకరితుమ్మెదలను
మొగముఁ దమ్ముల తావి మగుడఁ బిలువఁ
గడముట్టఁ జిదిమిన కలువక్రొవ్విరులను
దెలిచూడ్కిగమి పునఃస్థితికిఁ దేరఁ
బొంకులు వెడలిన పులినవేదికలను
పృథునితంబంబంబులు పెద్దసేయఁ
తే. గేళి చాలించి పరిపరిలీల లడర
జన్మకాలంబునను దుగ్ధజలధి వెడలి
వచ్చు నయ్యప్సరోంగనావలియుఁ బోలెఁ
గమలలోచన లంబుజాకరము వెడలి. 55

మ. దరులం బెట్టిన మాఱుఁ గట్టుమణుఁగుల్ తన్వంగు లుల్లాసముల్
మెరయం బింజలువోసి కట్టి వెస ధమ్మిల్లంబు లింపొందఁ గ్రొ
వ్విరులం గూడఁగఁ దీర్చి మేలితొడవుల్ వేవేగఁ గైచేసి చి
త్తరువుల్ వోలఁ దనూవిలాసరససౌందర్యంబు లుప్పొంగఁగన్. 56

వ. శంబరారాతి నారాధింప సమకట్టి. 57