పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. కలకంఠస్ఫుటకంఠకాహళులతో గర్వించు రాచిల్కతే
జులతో గేకిమదేభబృందములతో శుంభద్ద్విరేఫావళీ
బలసంఘమ్ములతోడ వచ్చి విడిసెం బర్యంతకాంతారవీ
థులఁ జైత్రాగమయామ్యదిక్పవనముల్ తోరా మరుం డుద్ధతిన్. 33

క. ఈగతి మధువిభవైకస
మాగమ మొ ప్పగుచు నుండ నత్యంతమనో
వైగుణ్యంబున నయ్యెల[1]
నాగదశల్ మేన నాఁడునాఁటికిఁ బొదలన్. 34
 
చ. చెవి కవతంసపల్లవవిశేషము చేయఁగ గండపాళికం
జివురును బోని మించుటఱచేయి ఘటించి మొగంబు వంచి గా
రవమున దాది పిల్చినఁ[2] బరాకునఁ బల్కనెఱుంగ కమ్మహీ
ధవసుత[3] యుండుఁ గొంతవడి ధాత్రిఁ బదాంగుళి నల్ల వ్రాయుచున్. 35
 
చ. నెలవులఁ బాఱు లేనగవు చెక్కులపైఁ దళుకొత్తఁ గుండలా
మలమణిదీప్తులం బెనఁగి మాటికిఁ జిత్రితగంధసారకో
మలనవపత్రవల్లికల మానితవిభ్రమ మావహింప[4] నౌఁ
దలఁ గదలించుచున్ వికచతామరసేక్షణ యూర్చు నెవ్వడిన్. 36
 
ఉ. బాలిక ప్రొద్దుపోకకయి పాటకుఁ[5] జొచ్చి పసిండివీణియం
గేలఁ దెమల్చి తంత్రులు బిగించి నఖంబుల మీటి యింపుమై
నాలతి సేసి పాడుఁ బ్రమదాశ్రుకణంబు లురోజపాళిపై
రాలఁగఁ జాలఁ గోకిలవిరావవిరోధితకాకలీశ్రుతిన్. 37



  1. నయ్యల
  2. దాడి విల్చిన
  3. మహిధమినుత
  4. ఆవగింప
  5. పాటగు