పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాథుం డుండు నున్నతమణిమయాసనంబునం గూర్చుండెఁ దదనుమతి నారాజకంఠీరవుండు నుపకంఠంబున నాసీనుండయ్యె నప్పుడు— 6

మ. వరభూషావళి మ్రోయకుండ నలఁతుల్గాఁ జామర ల్వీచు చొం
డొరులన్ సన్నల శైత్యకృత్యములకున్ యోజింపుచున్ లోచనాం
బురుహంబుల్ సదరస్మితంబులుగ సమ్మోహాబ్ధు లుప్పొంగి లో
గరుసుల్ మీఱఁగ నుండి రూరక కడంకల్ దక్కి లీలావతుల్. 7

క. స్మేరము లగు నిజనేత్రచ
కోరములు మునీంద్రవదన కుముదాప్తరుచిం
బారణలు సేయఁగాఁ బృథి
వీరమణుం డుండె వినయవినతాననుడై. 8

ఉ. ఆ సమయమ్మున న్మునిజనాగ్రణి కోమలదంతకాంతిరే
ఖాసుకుమారకేసరముఖస్ఫురదంబురుహంబు చూడ్కి కు
ల్లాసము చేయ నన్న కుశలంబె కుమారక యన్నఁ గౌతుక
శ్రీసముపేతుఁడై నృపతిసింహుఁడు చేతులు మోడ్చి యి ట్లనున్. 9

చ. త్రిభువనవంద్య మద్భవనదేహళి నీపదపంకజద్వయం
బభిమతలీలఁ దోకొనిన యప్పుడ ధన్యుఁడ నైతి సర్వమున్
శుభములె గాక యన్యములు చొప్పడునే భవదీయసత్కృపా
విభవవిశేషలబ్ధి పదివేల కనం[1] గుశలంబె నా కిఁకన్. 10
 
క. మునినాథ మీపదాబ్జముఁ
గనుఁగొనుట న్నన్ను ధన్యుఁగాఁ జేయుట ద
క్క ననఘ మఱి మీవచ్చిన
పని యన్యం బెద్ది పంచి పనిగొనవలయున్. 11

చ. అనవుడు లేఁతనవ్వు వదనాబ్జమున న్మొలతేర నాతఁ డి
ట్లను జననాథ లేవు మఱి యన్యము లెవ్వియు నాదురాకకుం
బనులు యథేచ్ఛమై భవనపంక్తులలో విహరించు నే నిలన్
వినినవిశేష మిప్పు డవనీధవ నీ కెఱిఁగింప వచ్చితిన్. 12



  1. పదివేలకునుం