పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉదయనోదయము


ద్వితీయాశ్వాసము


క. శ్రీమహిమాస్పద తిమ్మయ
రామామాత్య ప్రకృష్ట[1]రాజ్యాంగభరా
క్రామితనిజభుజవిభవో
ద్దామ శ్రీకేశ[2] బాచదండాధీశా. 1
 
వ. అవధరింపుము— 2

ఉ. అప్పుడు తద్వధూజనము లందఱు నద్భుతముల్ మనంబులం
జిప్పిల నొండొరుం గడవఁ జేరి రణన్మణి[3]కంకణారవం
బొప్పఁగ మౌళి నంజలులు యోజనసేయుచుఁ జేసి రర్చనల్
ముప్పిరిగొన్న భక్తి మదలోలవిలోచనపంకజంబులన్. 3
 
మ. మునినాథుం డరుదెంచెనన్న వచనంబుల్ తేనెలై వీనులం
జినుకన్ సంభ్రమ మొప్ప లేచి మహిభృత్సింహుండు లీలాగతిం
జని తత్పాదనసరోజముల్ ప్రమదబాష్పక్షీరపూరంబుచే
నొనరం డాఁచుచుఁ జాగిఁ మ్రొక్కె నిటలం బుర్వీస్థలిన్ మోపఁగన్. 4

ఉ. అమ్మునివల్లభుండు కరుణామృతవాఃపరిషేచనంబుచే
నమ్మనుజేంద్రు మేని మదనానలతాపము నుజ్జగింపుచుం
బమ్మిన భక్తి హేమమయపాత్రికచే నతఁ డిచ్చు నర్ఘ్యపా
ద్యమ్ములు నెమ్మిఁ గైకొని ముదమ్ముగఁ దత్కరదండ మూఁతగాన్. 5

వ. నారదుండు వీణె[4] నిజకరారవిందంబున నవలంబించి యల్లనల్లనఁ బాదపల్లవంబుల సోఁకున వసుంధరావధూటి కానందం బొనర్చుచు నేతెంచి యన్నర



  1. ప్రతిష్ఠ; ప్రతిష్ఠ
  2. ద్దామా లోకేశ
  3. రవన్మణి
  4. వణే