పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. మెత్తంగఁ దోడ్తోన మృగమదాకృతి నొందఁ
జందనం బెలదూండ్ల జార్చికొనుచు
జిలుక గొజ్జగనీరు చివ్వునఁ బొగలెత్తు[1]
సెగలకు మొగ మోర సేసికొనుచుఁ
బూఁదేనెఁ దోఁచి లేఁబొఱ చుయ్యిచుయ్యన
సారెసారెకు మేనఁ జమరికొనుచుఁ
జిటపొట నుడుకుచోఁ జెదరిపైఁ బడు ఘర్మ
బిందుసంహతికిఁ దప్పించుకొనుచు
తే. సోఁకుచో వేఁడిమికి వ్రేళ్ళు చుఱుకులీన
విద్రిచికొని[2] భీతి నాకులు వెదకికొనుచు
వేసటలువాసి మఱపును వెఱపులేక
చెలులు శిశిరోపవిధు లట్లు[3] సేయునపుడు. 194
 
సీ. చిగురున మొగమింత సేసియు లోఁదాల్చు
వనిత హస్తతలంబువంటి దనుచుఁ
బుష్పమంజరు లన బొమ ముడించియు మానుఁ
బూఁబోఁడి పాలిండ్లఁ బోలు మనుచు
నలరు లన్నను జివ్వుమని యంత నేతేఱు
నువిద మైమెలుపున కుపమ యనుచుఁ
గెందమ్ము లనఁ గంటగించియు సైరించుఁ
దరుణిమోమున కన్నదమ్ము లనుచుఁ
ఆ. దీవ లన్నఁ గ్రోధదృష్టిఁ జూచియుఁ దోన
మనసు తిరుగఁబట్టు మదమరాళ
యాన మెఱుఁగుమేని కనుఁగుఁజుట్టము లన
విభున కేల యందు ద్వేష మగును[4]. 195



  1. జిలుకగొజ్జిగినరు చ్చివనఁ బొగతిత్తు
  2. విట్టిచికొని
  3. శిశిరోపచారముల్
  4. విభున కుళయేలయందు ద్వేషియగును