పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ. ఇ ట్లనన్యవననిర్విశేషంబు లగు నవ్వనవిశేషంబు లన్నియు విలోకించుచు వచ్చి వచ్చి ముందట— 143

సహస్రానీకుఁడు సుధర్మసభయందుఁ బ్రవేశించుట


చ. హరిమణిసాలభంజికల హారి విధూవల కుట్టిమింబులన్
మరకతభిత్తిభాగముల మానితవజ్రమయైకవేదులన్
సరసిజరాగజాలములఁ జారుతరంబయి యంబరంబుతో
నొరసి సుధర్మయన్ సభ సమున్నతసన్నుతశృంగభాతిగన్. 144

వ. కనుంగొని— 145

క. చేరఁజని తత్సమీప
ద్వారంబున నిల్చి యింద్రువచనమునఁ బ్రతీ
హారుఁడు దను దోడ్కొని పో
నారాజవరుండు తత్సభాంతరభూమిన్. 146

సీ. నాభాగమాంధాతృనలదుంధుమారాది
నృపకోటి యొక్కచో నిలిచి కొలువ
నతిరాత్రవాజపేయాది మహాక్రతు
పారగు లొక్కచో బలసి కొలువ
నారదకౌండిన్యనాగదంతశుకాది
మునిముఖ్యు లొక్కచో మొనసి కొలువఁ
జిత్రలేఖాఘృతాచీమేనకాద్యప్స
రోంగన లొక్కచో హత్తి కొలువ
ఆ. సప్తమాతృకలును సప్తదిక్పాలురు
సప్తమునిగణంబు సాధ్యసిద్ధ
యక్షరాక్షసోరగామరప్రవరులు[1]
నలరి రంత నింద్రు[2] నలమి కొలువ. 147
 
వ. మఱియును— 148



  1. సోరగాదురద్రివరులు
  2. నలలుసాత సంక్ర