పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీపురివసతి[1] యూహించి కాదె సమస్త
ధర్మశాస్త్రములకుఁ దనరె శంక[2]
యీపురి కేపురు లీడురామినిఁ గాదె
యిది పూర్వదిశ యంచు నెన్నఁబడుట[3]
తే. యితరపురముల వర్ణించునెడలఁ గవుల
కిప్పురమ కాదె యుపమయై యొప్పుచూపు
సకలధర్మార్థకామమోక్షముల కెల్ల
పుట్టినిల్లు తలంప నీపురమ కాదె. 131
 
మ. అని డెందంబున కద్భుతంబును బ్రమోదావేశముం జేయ నూ
తనవస్తుప్రకరంబు గాంచుచును నుద్యచ్చాటువాక్యంబులన్
వినుతుల్ సేయుచు వచ్చి భాసురసురోర్వీజాతజాతప్రసూ
ననవీనాయత[4]వాసనా2యుతమనం దన్నందనాగారమున్[5]. 132
 
వ. చేరి తద్ద్వారప్రదేశంబున విమానావతరణంబు గావించి మాతలియుం దాను నభ్యంతరంబు ప్రవేశించి నడచునప్పుడు— 133

సీ. తలిరు లొత్తిన కల్పతరువుల పొరువులఁ
గొసరి కూయిడు మత్తకోకిలములు
ననిచిన హరిచందనంబుల చేరువఁ
గెరలి పల్కెడు రాజకీరములును
బూచిన మందారభూరుహంబుల పొంత
దొమ్ములాడెడు గండుతుమ్మెదలును
జాదుకో విరిసిన సంతానముల చెంత
దుమ్ము రేఁపెడి నాలితెమ్మెరలును



  1. ఈవు పరపతి
  2. ధర్మశాస్త్రమ్ము లుద్భవము నొందె; ధర్మశాస్త్రమ్ములు దడవికొంట
  3. యాడు యున్నబడుట; యాడుయని యెన్నబడుట
  4. ననిలీనాయత
  5. యుమగుందన్నంద నాగారమున్