పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెదురుగాఁ బిరికొని[1] పొదుగులు వ్రేల నొ
ప్పెసఁగ నిల్చిన పాడిపసులతోడ
రసరసాయనసిద్ధరససుధారసముల
లలి నొప్పు తమ్మికొలఁకులతోడ
తే. వయసువేలుపుఁగొమ్మలపైఁ దలంపు
మరలిరామిని నిండ్లఁ గాఁపురములకును
జాలి వర్తించు నప్సరఃస్త్రీలతోడ
వఱలు నమరావతీపురవరము డాసి. 129
 
సీ. ప్రోలెల్ల[2] మందారభూరుహంబుల యన్న
నెలదోఁటల విశేష మెన్న నేల
శిల్ప[3]కృత్యము లెల్ల చింతామణులె యన్న
మచ్చుటిండుల యొప్పు[4] మెచ్చ నేల
వీడెల్ల నచ్చరవెలచేడియలె యన్న
నలరుఁబోఁడులచెల్వ మడుగ నేల
ధేనులెల్లను గామధేనువులే యన్న
పాఁడిసౌభాగ్యంబు వేఁడ నేల
తే. రాజు దేవేంద్రుఁ డన నేల తేజ మడుగఁ
జెంతఁ బ్రవహించునది సిద్ధసింధు వనినఁ
బావనత వేఱ కొనియాడఁబోవ నేల
సురపురికి నీడె తక్కిన పురవరములు. 130
 
సీ. ఈపురిచేడెల యిఱుగౌఁగిళులు గోరి
కాదె పోరుల నిల్పు ఘనులపూన్కి
యీపురికాపురం బెద నాసపడి కాదె
పాయక జన్నముల్ సేయుపనులు



  1. నెదురుగాంచిరికొని
  2. పోయెల్ల; పొలయెల్ల
  3. శిత్వి
  4. మచ్చుటిండ్లయొప్ప