పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. ముజ్జగంబులు పావనంబులుగఁ జేయు
దేహ మెత్తిన తల్లి యే దివ్యమూర్తి
యట్టిగంగకు సాష్టాంగ మాచరించెఁ
గేలు ఫాలంబుఁ జేర్చి భూపాలవరుఁడు. 125

చ. కడలికి రాణివాస మనఁ గైటభవైరికిఁ గూర్మిపట్టి నా
మృడునకుఁ బూవుదండ యన మేటి నుతుల్ గని ముజ్జగంబు లి
ట్లెడపక శుద్ధి సేయఁ దను వెత్తిన తల్లివి నిస్తరింతు రే
ర్పడ[1] భవవార్ధి నార్యులు నభస్స్రవదాపగ నీవు దేపగన్[2]. 126
 
వ. అని కొనియాడుచు. 127

సీ. ఎసకంపుఁ బసిడి చిట్టిసుకతిప్పలమీఁదఁ
గవగూడియాడు జక్కవకవలును
గమ్మని పైఁడికెందమ్మిమాడువుటిండ్లఁ
గ్రీడించు నెలదేఁటి చేడియలును
దఱచైన నిద్దంపుఁ దరగయూయెలలను
దూఁగు బెగ్గురురాచతొయ్యలులును
బంగారుటెలదూండ్లఁ బట్టి చంచులఁ ద్రుంచి
మెసఁగు చక్కని హంసమిధునములను
తే. దరుల సురపాదపముల చెంతల నెమిళ్ళు
పెట్టు కొకరిక గుట్టల[3] తట్టియలును
గాంచి సంతోషరసవార్ధి గడలుకొనఁగ
నుత్తరాపగ దాఁటి నృపోత్తముండు.
 
సీ. తలఁపురామానికంబులఁ గట్టు సోరణ
గండ్లఁ జెన్నగు మాడుటిండ్లతోడఁ
బండి నేలకు వ్రేల[4] బడువేల్పు మ్రాఁకులఁ
దనరు పెందోటల తఱచుతోడ



  1. నీతశృంకలేర్పడ
  2. నభస్రతదాపగ నీవు దంపగన్
  3. కుట్టల
  4. కల్పుతూకుల