పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గీ. నిన్నుఁ దోడ్కొని రమ్మన[1] నెమ్మి నాదు
రాక విచ్చేయు మనవుడు రాజు నొప్పి[2]
చనఁగ సమకట్టి మంత్రుల సమ్మతమున[3]
మాతలియుఁ దాను దివ్యవిమాన మెక్కి.
 
వ. ఉత్తరాభిముఖుండై వియత్తలంబునం బోవుచు నెడనెడం గడచు నదీనదంబులు జనపదంబులు గిరికాననంబులు నవలోకించి తత్ సృష్టివిశేషంబులు మాతలి నడుగుచు వచ్చివచ్చి యమరావతీపురంబు చేరం జనుదెంచి తదుపకంఠంబున— 122

శా. అంగంబుల్ పులకింపఁ గన్గొనియె వత్సాధీశుఁ డంత న్నభో
గంగన్ మంగళనాదమేదురతరంగం గేళిలోలాభ్రమా
తంగన్ మంధరగంధవాహవిచలత్పద్మోల్లసచ్చారుసా
రంగన్ మంజుల భూరివంజుల[4] వనీరమ్యాంతరంగం దగన్. 123
 
ఉ. బంధురలీలఁ గర్ణపుటపర్వముగాఁగ మదాంధభూరి పు
ష్పంధయగానముల్ వినుచు సమ్మతితోఁ జనుదెంచి భూమిభృ
త్సింధురు సేద దేర్చె[5] నెడసేయక నిర్జరసింధుజాతసౌ
గంధికకంజపుంజవనగంధలసత్తనుగంధవాహముల్[6]. 124
 
సీ. వెన్నెల పూఁదాల్చు వేలుపునౌఁదల
మల్లెపూదండ యే మంజులాంగి[7]
బొడ్డున ముదివేల్పుఁ బుట్టించుహరిపాద
కమలంబుపట్టి యే కలువకంటి
మహివధూమణికటీమణిసూత్రమగు వార్ధి
పట్టంపురాణి యే పద్మగంధి
కపిలుచేఁ గ్రాగిన నృపకోటి మీఁదికిఁ
బోవునిశ్రేణి యే పూవుఁబోణి



  1. రయన
  2. నొస్సి
  3. సయతమున
  4. భూవిదరన్జుల
  5. స్సింధురసిదందేర్చ
  6. గంధణతుముల్
  7. మాటినంగ; మానితాంగి