పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. ఆ భాస్కరార్యవర్యుఁడు
ప్రాభవమునఁ గోనమాంబఁ బరిణయమయ్యెన్
శ్రీభామామణి నంబుజ
నాభుఁడు శంకరుఁడు శైలనందనఁ బోలెన్. 61

క. కరుణామణి కోనాంబయు
హరిశౌర్యుఁడు భాస్కరుండు నద్రికుమారీ
హరిణాంకధరుల విధమున
సురుచిరదాంపత్యమహిమ శోభిల్లి రిలన్[1]. 62
 
సీ. గురుతరమె నటి పరమపాతివ్రత్య
గరిమచేఁ బార్వతీకాంతఁ బోలి
పాలితానూనసంపద్భాగ్యమహిమచేఁ
గమలావధూటితోఁ గలసిమెలసి
విపులమాధుర్యోక్తివిభ్రమంబులఁ బల్కు
జవరాలితోడ బాంధవ మొనర్చి
లావణ్యరూపరేఖావిలాసప్రౌఢి
రతిదేవితోడఁ బోరామిసేసి
తే. వెలసె నేరీతి ధాత్రి సాధ్వీలలామ
బంధుసురశాఖి లోకయబాచమంత్రి
మౌళి యర్ధాంగలక్ష్మి సమస్తలోక
మానితోరుగుణాలంబ కోనమాంబ. 63

సుగంధి[2]. కోనమాంబ కీర్తిఁ గాంచెఁ గోవిదార్థి కామధు
గ్ధేనువై ముఖప్రభవధీరితేందురేఖయై[3]
శ్రీనగేంద్రకన్యకాశచీసమాన శీ
లానుకూల భాగ్యవైభవాభిరామమూర్తియై. 64



  1. శోభిదివిలను
  2. మత్తకోకిల
  3. గ్ధేనుప్రముఖప్రభావనింశరేఖాను