పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చ. తనుఁ గనుఁబ్రామి పాఱి[1] కరధౌత తటంబున నాత్మబింబముం
గని గజమంచు 2మోద నరుగం[2] గరిగాదు కుమార! నీడరా
యనుచు భవాని గోఁచికొనయాని పిఱిందికిఁ దివ్వఁ గ్రమ్మఱం
బెనఁగు గజాస్యుఁ డీవుత మభీష్టము లోకయబాచమంత్రికిన్. 5
 
ఉ. చే యెగఁజాఁచి పూజలిడ[3] సిగ్గునఁ బయ్యెద బాహుమూలముం
బాయక కప్ప మోచి మఱువడ్డయురోజము క్రేవ నొత్తుగో[4]
రాయెడఁ జూచి యల్లనగు నాత్మవిభుం గడకంట జంకెనల్
సేయు భవాని లోకబుధశేఖరు బాచని ధన్యుఁ జేయుతన్. 6
 
ఉ. పుట్టిన కూర్మిమచ్చయను పొచ్చెమునం దనదాయఁ[5] బట్టముం
గట్టినవాఁడుగా కురము కప్పునకుం గత మేమి యంచు లో
నిట్టలమైన కింకఁ బతి నెగ్గులు వల్కెడు లక్ష్మి ప్రోచు నా
రట్టడి (వై)రిపోత్రు[6] బుధరంజను లోకయబాచచంద్రునిన్. 7
 
సీ. కేల మీటిన దంత్రికిం[7] బ్రవాళమునకుఁ
గరనఖద్యుతి కోరకముల నీనఁ
గరముల నంటుచోఁ గంగణక్వణనంబు
చక్రనిల్యత్ననిస్వనము సేయ
గాత్రంబు చూపుచోఁ గంఠంబు తంత్రికా
పంచమంబునకుఁ దోడ్పాటు నెఱపఁ
జెవిగట్టియల చెంతఁ[8] జెలఁగు లేఁదేఁటుల
మొరపం[9] బుపాంగంబు మురువు చూప



  1. పాలి
  2. మోదునరగా
  3. పూజలెద
  4. క్రేవయొత్తుగో
  5. (దల)కాయ
  6. నా రట్టజ(హా)రిపత్రు, నారట్టడి( )రిపోత్రు
  7. కిలబిటినదత్నికి, కీలఘట్టితతంత్రికిఁ బ్రవాళమునకు
  8. జీవగఱయచంత్ర, జెవికర్ణికకుఁ జెంత
  9. మాణపం