Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆత్మవిచారము

అని చెప్పియున్నది. ఈ ఉపాధులలో ప్రవేశించి అచ్చటచ్చట సంపాదించిన యనుభవములను తమ తమ ప్రాజ్ఞాత్మలకు నివేదించి పపుడు ప్రాజ్ఞాత్మలు తమ ప్రతిబింబములు చేసిన పనికి మెచ్చి ఇంత వరకును తాము నిస్పృహులవలె ఉండినను ఇప్పటినుండి తాము తైజసవైశ్వానరాత్మలయొక్క వికాసమందు అభిరుచిని చూపు దురు. ఈవరకే మనోమయ కోశము అంకురించి యుండినది. ఆ అంకుర్గమును వృద్ధిచేయుటకు తగు ప్రయత్నములను ప్రాజ్ఞా త్మలు చేయుచు తమ ప్రతిబింబములైన తైజస వైశ్వానరాత్మలకు విజ్ఞానమయ కోశము అంకురించుటకు కావలసిన ప్రయత్నముల యందు సహాయము చేయుదురు.

మనోమయ కోశముయొక్క పుట్టుక మృగములయందే కన బడును. కొంతమట్టుకు పూర్వాపర విచారమును, చిత్తముయొక్క ధర్మమైన సృతి లేక స్మరణము అను జ్ఞాపకమును నిన్న టిదినము తాను చేసిన కార్యములను జ్ఞాపకముంచుకొనియుండుటయు మృగ ములయందు కొన్నిటియందు కనబడును. అనగా అంతఃకరణము (అహంకారము, మనస్సు, చిత్తము, బుద్ధి) కొం చెముకొం చెముగా వృద్ధి చెందుచున్నదని యర్థము. మన యిండ్లయందు పెరుగుచున్న 'మృగములయిన పిల్లి, కుక్క, గుఱ్ఱము, ఆవు మొదలగు మృగము లకు మనస్సు అతిశీఘ్రముగా నంగురించి వృద్ధియగుచు వచ్చును. సమూహాత్మగారు తైజసవైశ్వానరాత్మలయొక్క లేతవయస్సునందు అనేక వేల లెక్కలకొలది గలవానిని తనయొక్కరి చూపున నుంచు కొనియుందురు. తైజస వైశ్వానరాత్మలు కొంతకొంతగా వృద్ధి చెందుచురాగా నొక్కొక్క సమూహాత్మయు తన విచారణ క్రింద