Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

ఆత్మవిచారము

[3 వ

మెంటల్ కింగ్డమ్ Elemental kingdom. సౌరాత్మవర్గము స్వర్గలోకమునకు చేరినది. స్వర్గలోకపు దైవము సూర్యుడు. అతని సంబంధి సౌరాత్మవర్గము. ఇదే రెండవ ఎలిమెంటల్ కింగ్డం Elemental kingdom. చంద్రాత్మవర్గము భువర్లోకమునకు సంబంధించినది. భువర్లోకమునకు చంద్రలోక మని పేరు. ఇదే మూడవ తరగతి ఎలిమెంటల్ కింగ్డమ్ Elemental kingdom. సప్తసృష్టివర్గములు వరుసను 1. అభ్యాత్మవర్గము, 2. సౌరాత్మవర్గము, 3. చంద్రాత్మవర్గము, 4. ధాతువర్గము, 5. తరుగుల్మలతావనస్పతివర్గము, 6. మృగవర్గము, 7. మానవవర్గము.

ఆధ్యాత్మికసృష్టి

సచ్చిదానందమూర్తియొక్క ప్రవృత్తిమార్గయాత్రయందు ప్రజ్ఞానాంశువు లను తురీయాత్మలు వానియొక్క ప్రతిబింబములైన ఆత్మబుద్ధిమనస్కులు అను అపరనామధేయముగల ప్రాజ్ఞాత్మలను కలుగజేసికొని సత్యలోక, జనలోక, తపోలోకములయందు చర్య జరిపి అనుభవములను సంపాదించు మని నిర్దేశించిన వనియును అట్టి ప్రాజ్ఞాత్మలు స్థూలత్రిలోకి యయిన స్వర్గలోకము, భువర్లోకము, భూలోకము అను లోకములయందు సంచరించి "స్థిరచరనికరవ్యాపిభిః” అన్నట్టు స్థూలాతిస్థూల, స్థూల, సూక్ష్మ ఉపాధుల యందు ప్రవేశించి అనుభవములను సంపాదించి వానియొక్క సారాంశములను తమకు నివేదనచేయు మని తమయొక్క ప్రతిబింబములైన తైజసవైశ్వానరాత్మలను నియమించి రనియును అట్టి తైలసవైశ్వానరాత్మలు, స్థావరజంగమాత్మకమను సృష్టియందు ధాతు