అధ్యా 3]
ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు
73
లను దేవతలు ఇచ్చియుందురు. ఈ విధముగా తిర్యగ్జంతుజాలపు శరీరములయందు వివిధానుభవములను చెంది తైజసవైశ్వానరాత్మలు కాలక్రమమున మానవశరీరములలో ప్రవేశించుటకు సిద్ధపడుదురు.
తైజసవైశ్వానరాత్మలు ధాతువర్గమునందు ప్రవేశించి భూలోకపు అనుభవములను సంపాదించుటకు ఆరంభించిరని 61 వ పుటయందు చెప్పబడెను. దివ్యజ్ఞానసమాజపు పుస్తకములయందు సృష్టివర్గముల సంఖ్య ఏడు అని చెప్పబడియున్నది. "నిహితాస్సప్తసప్త" యని యుపనిషద్వాక్యమున్నది. ఐనను సనాతనధర్మ గ్రంథములయందు ముఖ్యముగా నాలుగు విధములే చెప్పబడి యున్నవి. ధాతువర్గము, తరుగుల్మలతావనస్పతివర్గము, మృగవర్గము, మానవవర్గము అని. కొన్ని గ్రంథములయందు ధాతువర్గమునకు పూర్వము మూడు వర్గములు కలవని చెప్పియున్నది. దివ్యజ్ఞానసమాజపు పుస్తకములలో ఎలిమెంటల్ కింగ్డములు Elemental kingdoms అని వ్రాసియున్నారు. ఇవి మూడు తరగతులు గలవి. మహర్లోకమందు మొదటి తరగతివి, స్వర్గలోకమునందు రెండవ తరగతివి, భువర్లోకమునందు మూడవ తరగతివి అని చెప్పియున్నది. ఈ మూడుతరగతులును శ్రీమద్భాగవతము నందు చెప్పిన వైకారిక సృష్టికి సంబంధపడినవి అనుకోవచ్చును. అయినను అంతకంటె వివరమైనదియు దివ్యజ్ఞానసమాజపు గ్రంథములయందు చెప్పినవిధముగానే యించుకైనను వ్యత్యాసములేక యొకపురాతన గ్రంథమునందు ఇటీవల కనుబడినది. అభ్యాత్మ వర్గము, సౌరాత్మవర్గము, చంద్రాత్మవర్గము అని. మహర్లోకమునందు అభ్యాత్మవర్గ ముండవచ్చును. ఇదే మొదటి తరగతి ఎలి