70
ఆత్మవిచారము
[3 వ
తాభ్యో శ్వ మానయ త్తా అబ్రున న్న వై నో౽యముల మితి ।
(ఐతరేయోపనిషత్)
వారలకు గుఱ్ఱముయొక్క శరీరమును చూపెను. వారు మా కిది తృప్తిగాలేదనిరి. పిమ్మట అనేక వేల సంవత్సరములకు తరువాత
తాభ్యః పురుష మానయత్ తా అబ్రువన్
సుకృతం బతే తి పురుషో వా వ సుకృతం ।
పురుషశరీరమును దేవతలకు సృష్టికర్త చూపెను. వారు ఆహా ! పురుషశరీరము బహుబాగు అని చెప్పి ఆ శరీరమందు ప్రవేశించిరి.
ఐతరేయోపనిషత్తు వాక్యముల ప్రకారము మానవశరీరము సృష్టియగునంతదాక నింద్రియాధిష్ఠానదేవతలు మానవశరీరమునకు క్రింది శరీరములలో ప్రవేశించుటకు ఒప్పలేదు అని తెలియుచున్నది. ఇంద్రియాధిష్ఠాన దేవతలు ప్రవేశించి వారి వారి యింద్రియముల యొక్క గోళములలో నిలకడగా నిలుచునంతవరకును జీవాత్మ
ప్రవేశించరు అని ఈ యుపనిషత్తులో నింక కొంతదూరము పోతే విశదమగును. కనుక మనుష్యేతరశరీరములలో జీవాత్మ ప్రవేశించ లేదు అని దృఢముగా తెలిసికొనవలయును. జీవాత్మ ప్రవేశించిన మానవశరీరములు అనగా మనుష్యులు ఒకరొకరు వారి వారికి తోచిన ప్రకారము తమతమ కార్యములనుగురించి నిర్ధారణచేసి కొందురు. ఒక వస్తువును చూచినపుడు ఒకనికి ఆహ్లాదముండును ;
మరియొకనికి ఆహ్లాదముండదు; మూడవవానికి దుఃఖము గలిగినను కలుగును. ఇట్లు సమూహచేష్టలేక వారి వారిమట్టుకు వారు వారు చింతించుకొని కార్యములు చేసికొనుస్థితి రాకపోయినపుడు జీవాత్మ