అధ్యా 3]
ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు
69
ములగు శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, రసనేంద్రియము, ఘ్రాణేంద్రియము ఇవన్నియు చర్య జరుపు చుండినను మనుష్యశరీరమందు జ్ఞానేంద్రియములు పనిచేయునంత సుష్ఠుగా తిర్యగ్జంతువులయందు పనిచేయవు. మరియు అంతరింద్రియమైన మనస్సు మనుష్యునియందు పనిచేయునంత సుష్ఠుగా తిర్యగ్జంతువులయందు పనిచేయచాలదు. కనుక మనస్సు సుష్ఠుగా పనిచేయుటకు సాధ్యమగునంతవరకును తిర్యగ్జంతువులు వృద్ధి అనగా అంతఃకరణపరిపాకమును పొందుటకు సమూహాత్మ యొక రుండవలయును. జీవాత్మలు సుష్ఠుగా సిద్ధమైన మానవ దేహములలోనే గాని ఇతరదేహములలో ప్రవేశించరు. సృష్టిని ఆరంభించి అనేక జంతువులు సృష్టింపడెను,
సృష్ట్వా పురాణి వివిధా న్యజ యాత్మశక్త్యా
వృక్షాన్ సరీసృపపశూన్ ఖగదంశ మత్స్యాన్ ।
అను శ్లోకము 53 వ పుటయందు అచ్చుపడియున్నది. అందులో చెప్పిన ప్రకారము అనేక జంతువులను సృష్టించి ఆ శరీరములలో ఇంద్రియగోళములను కూడ కల్పించి తత్తదింద్రియాధిష్ఠానదేవతలను పిలిచి
తాభ్యో గా మానయత్ తా అబ్రువన్ న వై నో౽యముల మితి ॥
(ఐతరేయోపనిషత్)
వారికి ఆవుశరీరమును చూపి ఈ శరీరమునందలి ఇంద్రియగోళములలో ప్రవేశించవలెను అని సృష్టికర్త చెప్పెను. వారు మాకు ఈ దేహము తృప్తిలేదు అని చెప్పిరి. అనేక వేల సంవత్సరములకు పిమ్మట