Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

ఆత్మవిచారము

[3 వ

(4) నీటనుండుజంతువులు - మొసళ్లు మొదలగునవియు, పక్షులును. (ఆకాశమందు పరుగిడు కంక గృధ్ర బక శ్యేన హంస సారసాదులగు పక్షి జాతులను క్రిమిక్రీటాదులను కూడ తిర్యగ్జంతువులతో లెక్కపెట్టవలయును.)

సమూహాత్మ

క్రిమికీటములు సాధారణముగా బల్లి, తొండ, పక్షులు మొదలగువానికి ఎరగా నేర్పడియున్నవి. క్రిమికీటములు కూడ జగద్వ్యాపారమందు వికాసమునకు రావలసిన జంతువులే. ప్రతిజాతి జంతువులకును ఆ జాతి కంతయు చేరి సమూహాత్మ యొకరుందురు. నల్లులు అను క్రిములకంతయు ఒక సమూహాత్మ. పిల్లులకంతయు నొక సమూహాత్మ. పాములలో ననేక జాతులుండినను వాటికంతయు వేర్వేరు సమూహాత్మలు. పైన చెప్పబడిన తిర్యగ్జంతు జాలమునకెల్లయు నొక్కొకజాతికి నొక సమూహాత్మ వేరు వేరుగా నుండును. అంతఃకరణవికాసము ఒక పదవికి వచ్చునంతవరకు సమూహాత్మ అవశ్యము.

సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే

అనగా జ్ఞానేంద్రియములయొక్కయు కర్మేంద్రియములయొక్కయు వ్యాపారము అని అర్థము. దేహధారణార్థమును, జాతితంతు సేవార్థమును ఆహారనిద్రాభయమైథునాదులు తిర్యగ్జంతువుల యందు విశదముగా కనబడును. కొంతమట్టుకు జ్ఞానేంద్రియ