Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 3]

ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు

63

పెట్టితే ఆ నీటి వేడిమి తగ్గను తగ్గను నీరు ఎండిపోయి ఆ నీటియందు కరిగి కలిసిపోయిన పటికపొడి ఆ పొడిగానే అదియుండిన పాత్రలో నుండవలెనుకదా. అట్లుండదు. ఆ నలుసు లన్నియు నొకటితో నొకటి చేరి విచిత్రములగు రాళ్లుగా నేర్పడును. పటికను కరగచేసి ఎన్ని తడవలు మరల మరల కరిగించినను అదే రూపము నెత్తును. ఇదే విధముగా మైలుతుత్తముకూడ. ఇందు వలన ఆ పటిక - నలుసులయందును మైలుతుత్తపు నలుసుల యందును ఒకజ్ఞానము కనుపడుచున్నది అని ఊహించవలెను.

లోహములకు అలసట కలదని పాశ్చాత్యశాస్త్రజ్ఞులు చెప్పియున్నారు. నిరంతరము పనిచేయుటవల్ల అలసట ప్రాప్తించును. ఒక గడియారమందు లోహముతో చేయబడిన భాగములు ప్రతి నిమిషమును ఎడతెగక పనిచేయుచు వచ్చుచు కొన్ని సంవత్సరములకు పిమ్మట కాలనిరూపణము అను చర్యను తప్పుగా చేయు చుండును. అప్పుడు మరమ్మత్తులు అవశ్యము లేక కొన్ని దినములు పనిచేయనీయక ఊరకయుంచితే మరియు పూర్వమువలె బాగా పనిచేయ నారంభించును. స్థూలాతిస్థూలములైన ధాతువర్గ ఉపాధులయందు ప్రవేశించిన జీవాత్ములు (తెజసవైశ్వానరాత్మలు) ఆధాతువర్గములకు సంబంధపడిన దేవతలయొక్క సహాయమువల్ల తాము పొందతగిన అనుభవములను పొంది అనేకవేల సంవత్సరములకు పిమ్మట స్థావరములయ్యు కొంతమట్టుకు స్వేచ్ఛావిహార శక్తిగల ఓషధివనస్పత్యుపాధులలో ప్రవేశింతురు. స్థావరములైన ధాతువులు అనగా పాపొణాదులు. వానికి ఒక స్థలము విడిచి మరియొక స్థలమునకు పోవుశక్తి లేదు. ఉన్నస్థలమునందైనను తమ