అధ్యా 3]
ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు
57
మేలుదురు అని చెప్పబడెను. ఇద్దరిలో మొదటివారు ప్రధాన మనువు. రెండవవారు ఉపమనువు. ఇద్దరుమనువులయొక్క రాజ్యకాలమునకు మన్వంతరము అని పేరు. మన్వంతరము అను పదములో రెండు పదములున్నవి. మను + అంతరము. అనగా "మనువులయొక్కమధ్య" అని అర్థము. ప్రధానమనువుకు సహాయభూతుడై యొకమహర్షియుండును. ముఖ్యమహర్షికి సహాయులు ఇతరఋషులుందురు. శ్రీమద్భాగవతము, విష్ణుపురాణము మొదలుగాగల అనేక పురాణములయందును మనువుల పేళ్లును ఋషుల పేళ్లును వారు వారు చేసిన చర్యలును కనబడుచున్నవి. అయితే అతి జాగరూకతతో విమర్శించి చదివితేనే గాని అర్థము వీడదు.
1. స్వాయంభువమనువు, 2. స్వారోచిషమనువు
వీరల సుతులు.
ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, చైత్రుడు, చిత్రుడు, మదనుడు, కింపురుషుడు మొదలుగాగలవారలు.
వీరికాలపు ఋషులు.
భృగువు, మరీచి, అఙ్గీరస్సు, అత్రి, క్రతువు, పులహులు, వసిష్ఠులు, ప్రాణుడు, వాతుడు, అగ్ని, వృషుడు, నిస్వరుడు, స్తంబకుడు, ఊర్జకుడు.
3. ఉత్తముడు, 4. తామసుడు
వీరిపుత్రులు.
విరజస్సు, గాత్రుడు, ఊర్ధ్వబాహువు, సవనుడు, అవఘుడు, సుతపస్సు, శుక్రుడు, ఖ్యాతి, జానువు, జుఙ్ఝుడు, కేతురూపుడు మొదలుగాగలవారు.