54
ఆత్మవిచారము
[3 వ
యున్నది. కనుక తురీయాత్మయొక్క ప్రతిబింబము పాంచభౌతికప్రపంచమందు స్థావరజంగమ శరీరములు అందులో నుద్భిజ్జ స్వేదజ అండజ జరాయుజములను తెఱగులగు శరీరంబులం బ్రవేశించి ప్రవృత్తిమార్గయాత్ర యెట్లుచేసినది అను వివరమును విచారించవలెను.
ఆధ్యాత్మిక సృష్టికి అధికారిక పురుషు లనేకుల సహాయము కావలెను. అందులో మనువు అను అధికారి అతిముఖ్యుడు. కనుక మనువులను మన్వంతరములు మొదలగు విషయములను విచారించి తరువాత ఆధ్యాత్మిక సృష్టిని విచారింతుము.
మన్వంతరములు — ప్రళయములు
ఆధిభౌతికసృష్టి, ఆధిదైవికసృష్టి యీ విషయములను గురించి వ్రాయుచువచ్చి ఆధ్యాత్మికసృష్టివిషయమై వ్రాయుటకు ముందు ఆధ్యాత్మికసృష్టియందు ముఖ్యాధికారమును పొందిన అధికారియగు మనువునుగురించి ప్రశంసించవలెను. ప్రతికల్పమునందును 14 మనువులు రాజ్యమేలుదురు. మనువులరాజ్యకాలమును విచారించుటకుముందు కాలస్వరూపమును విచారించవలెను.
తే౽హోరాత్రవిదోజనాః
అని శ్రీమద్భగవద్గీతయందు 8 వ అధ్యాయమునందు చెప్పియున్నది. అహోరాత్రములు అనగా పగళ్లు, రాత్రులు. మనుష్యుల పగళ్లు మనుష్యల రాత్రులు మనకు అనుభవమునందున్నవి గదా. సూర్యప్రకాశమున్నంతవరకును మనకు పగలు. సూర్యాస్తమన