Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 3]

ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు

53

దేవగణములను వర్ణించియున్నది. ముఖ్యముగా అష్టదిక్పాలకులు, విష్ణుదూతలు, శివదూతలు, చిత్రగుప్తగణములు, సిద్ధులు, సాధ్యులు, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, అప్సరసలు, మరుత్తులు, యక్షులు; గంధర్వులు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, ఉరగులు,. సుపర్ణులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, రాక్షసులు, పరానస్థులు, చారణులు, ఉత్కలులు, వైకలులు, వనస్పతులు, శాకినీ, డాకినీ మొదలుగాగల దేవతాగణములందరును సత్యలోకముమొదలు భూలోకపర్యంతమును గల లోకములయందు ముప్పదిముక్కోట్లు ఉందురు. కరుణామూర్తియయిన పరమేశ్వరుడు మనుష్యసృష్టికి ఉద్యుక్తుడై ఇక రాబోవు జీవాత్మల సహాయార్థమై వైకారికి సృష్టి అని పురాణములయందు వాడుకపడిన దైవసృష్టి చేసి ఆ దేవతలను ముందురాబోవు జీవాత్మలను మానవశరీరమును పొందుటకుగా అనుకూలమైన మార్గములయందు నడుచునట్లు సహాయపరుతురు.


సృష్ట్వా పురాణి వివిధాన్యజయా౽త్మశక్త్యా
     వృక్షాన్ సరీసృపపశూన్ ఖగదంశమత్స్యాన్ ।
తైస్తైరతుష్టహృదయః పురుషం విధాయ
     బ్రహ్మావలోకధిపణం ముదమాప దేవః ॥

(శ్రీమద్భాగ - 11 స్కం, 9 అ )


దీనితాత్పర్యము - దేవుడు ఆత్మశక్తిచే వృక్షసరీసృపఖగదంశ మత్స్యపశ్వాది నానాదేహములను సృజించియు తనియక బ్రహ్మా పరోక్షసాక్షాత్కారసాధనంబైన బుద్ధినియ్యగల మనుష్యశరీరంబును సృజించి ముదంబొందె నని శ్రీమద్భాగవతంబున చెప్పి