Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఆత్మవిచారము

[3 వ

గనుక స్వర్గలోకము, భువర్లోకము, భూలోకము అను ముల్లోకములందును తనకు ప్రతినిధిగా తనయొక్క ప్రతిబింబమైన "తైజసవైశ్వానరాత్మ” ను నియమించి ప్రతిజన్మమందును “తైజసవైశ్వానరాత్మ" పొందిన అనుభవములయొక్క సారాంశమును తనలో నైక్యపరుచుకొనును. ఇందును గురించిన వివరములు పునర్జన్మవిచారము అను అధ్యాయమునందు విస్తారముగా చెప్పబడును.

పాంచభౌతికప్రపంచమందు ప్రవేశించిన తురీయాత్మ తనయొక్క ప్రతిబింబము, ఆ ప్రతిబింబముయొక్క ప్రతిబింబము ఈ రెండును తన స్వంత అభీష్టముప్రకారమే పనిచేయుచున్నారా లేక తప్పుత్రోవలలో చరించుచున్నారా అని మాత్రము జాగరూకతతో కాచియుండును. జీవునియాత్రయందు చాలదూరము ప్రయాణము జరిగి నివృత్తిమార్గప్రయాణము నారంభించు సమయము సమకూరువరకును తురీయాత్మగారు తనయొక్క అధికారమును చూపి వారి ప్రతిబింబమైన ప్రాజ్ఞాత్మను సరియైనదారిన నడుపను స్వధాగా పూనుకోరు.

ఇకమీదట తైజసవైశ్వానరాత్మ స్థూలశరీరమును సంపాదించుకొనిన విధమును విచారించవలెను. "అమూర్తానాం చమూర్తానాం ధ్యాయినాం యోగచక్షుషాం” అని యొకశ్లోకము కలదు. ఇచట చెప్పబడియుండు "అమూర్తథ్యాయు" లు అను వారిని దివ్యజ్ఞానసమాజ పుస్తకములయందు "అరూపదేవతలు” అందురు. అదేవిధమున "మూర్తధ్యాయు"లను "రూపదేవతలు" అందురు. ఇందరును మరియును గల వేలకొలది అయిన దేవతాగణములు ఉన్నవి. స్కాందపురాణమందు అనేకములైన