అధ్యా 3]
ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు
51
తురీయాత్మలు పాంచభౌతికప్రపంచప్రవేశ మారంభించుసమయమందు "సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ ” ఏడుప్రవాహములగా బయలువెడలిరి. తెల్లనివర్ణముగల సూర్యప్రకాశమందు ఒకకిరణమును తీసి పగలతీసినట్టైతే ఆ తెల్లవర్ణము ఏడు వర్ణములుగా కనబడునని పాశ్చాత్య ప్రకృతిశాస్త్రమునందు ప్రవీణులైన పండితులు రుజువుపరిచియున్నారు. అదేవిధముగా కోటిసూర్యప్రకాశమువంటి ప్రకాశముగల పరమేశ్వరుని కిరణములైన తురీయాత్మలు కూడ ఏడువిధముల ప్రవాహముగా బయలువెడలిరి. ఒక్కొక ప్రవాహమునకును ఒక్కొక్క అధికారికపురుషు డీశ్వరతుల్యుడు అధిపతి.
ఈ అధికారికి దివ్యజ్ఞానసమాజపు పుస్తకములలో Planetary Logos (ప్ళొనెటరీ లోగాసు) అని పేరు. లోకములయందు ప్రవృత్తిమార్గయాత్ర చేయుచున్న జీవాత్మలందరును పై చెప్పిన యేడు ప్రవాహములలో యేదో ఒకటికి చేరినవారు. పాంచభౌతికప్రపంచమందు ప్రవేశించుటకు ఇష్టపడక పరమేశ్వరుని సామీప్యముననే నిలిచియుండు తురీయాత్మలు అనేకులు. వారి విచారణ మనకవశ్యము లేదు. పాంచభౌతికప్రపంచమందు తనయొక్క ప్రతిబింబమైన ప్రాజ్ఞాత్మయను "ఆత్మబుద్ధిమనస్కు" ని వ్యవహారము జరుపుమని తురీయాత్మ నిర్దేశించి తన ప్రతినిధి అయిన "ఆత్మబుద్ధిమనస్కుడు” సంపాదించిన అనుభవముల సారాంశము నంతయు తురీయాత్మ తనలో జీర్ణపరుచుకొనును. తద్వారా పాంచభౌతికప్రపంచముయొక్క అనుభవమును ఎరిగినవాడగును.
ఆత్మబుద్ధిమనస్కుడు అను ప్రతిబింబము మహర్లోకమునకు క్రింద జరుగు వ్యవహారములలో చర్యజరుపుటకు అంతగా నిష్టపడరు