48
ఆత్మవిచారము
[3 వ
"తైజసవైశ్వానరాత్మ" పొందిన అనుభవములయొక్క సారాంశములన్నియు ప్రాజ్ఞాత్మయొక్క అంతఃకరణమునందు ఇమిడి వారి అంతఃకరణపరిపాకమునకు కారణము లవును. ఈపుస్తకము నందు సంజ్ఞార్థముగా నుపయోగించిన 1. తురీయాత్మ. 2. ప్రాజ్ఞాత్మ. 3. తైజసవైశ్వానరాత్మ అను నామములు శాస్త్రసమ్మతములు గావు అని పండితులు ఆక్షేపించవచ్చును. ఐనను సంజ్ఞార్థము ఏదో పేళ్లుపెట్టవలసియున్నందున ఈ పేళ్ల నుపయోగించవలసి వచ్చినది. తప్పులైనయెడల పండితులు మన్నింతురని నమ్ముచున్నాము.
దేహబీజము లన్నిటిలో మొట్ట మొదట స్థూలాతిస్థూలమైన పృథివీతత్త్వపు భూతసూక్ష్మము విజృంభించుట కారంభించును. ప్రతిభూతసూక్ష్మమును విజృంభించు నపుడు తనజాతికి చేరిన భూతసూక్ష్మములనే ఆకర్షించును. బహిఃప్రపంచమునందలి అనుభవములు మనుష్యుని మనస్సునకు (అంతఃకరణమునకు) సుఖము, సంతోషము, దుఃఖము అను అనుభవములను ఇచ్చును.
విషయానా మానుకూల్యేన సుఖీ దుఃఖీ విపర్యయే ।
విషయములు ఇంద్రియములకు అనుకూలముగా నుండినపుడు మనము సుఖమును అనుభవించినాము అనుకొందుము. అదే విషయములు ప్రతికూలముగా నుండినపుడు దుఃఖము అనుభవించినాము అనుకొందుము. ఇట్టి సుఖదుఃఖానుభవములు కలిగి నప్పుడు అంతయు మనకు కలుగునట్టి సంతోషమువల్ల మన అంతఃకరణము వికసించును. ఈ స్థితికి అంతఃకరణ + ఆయామము అని పేరు.