46
ఆత్మవిచారము
[3 వ
ప్రవేశించిన జీవాత్మలను వారలు నడువవలసిన మార్గములయందు నడుపుచు వారల పురోవృద్ధికి కావలసిన దేహబీజములు అని వ్యవహరింపబడు భూతసూక్ష్మములను ప్రతి ప్రజ్ఞానాంశువునకును అదికోరుకొనిన భూతసూక్ష్మమును ఈ దేవతలు సంపాదించి యిచ్చెదరు. ఈ ఉన్నతలోకమునందుండు దేవతలు ఇతర బ్రహ్మాండములలోనుండి వచ్చి మన బ్రహ్మాండముయొక్క అధికారములను వహించిన వారు. వారి పూర్వానుభవజ్ఞానము నుపయోగించి తాము తమ చిన్నవయస్సునందు ఏవిధముగా నితరుల సహాయమును కోరి అట్టి సహాయమువల్ల పురోవృద్ధికి వచ్చిరో అట్టి అనుభవజ్ఞానముతో ఇపుడు క్రొత్తగా తమలోకమునకు వచ్చిన జీవాత్మలను స్నేహము చేసికొని వారికి కావలసిన సహాయములను ఇత్తురు. సచ్చిదానందమూర్తి యొక్క స్వభావములైన సత్ - చిత్ ఆనందములు అను అంశలను వృద్ధిపరుచుకొనుటకై ఆకాశతత్త్వపు భూతసూక్ష్మము నొకటిని, వాయుతత్త్వపు భూతసూక్ష్మమునొకటిని, తేజస్తత్త్వపు భూతసూక్ష్మ మొకటిని అనగా మూడువిధములైన భూతసూక్ష్మములను ఆ యా లోకముల ప్రకృతినుండి వీడదీసి జీవాత్మకు ఇచ్చి ప్రవృత్తిమార్గయాత్రకు సిద్ధపరతురు. ఇట్లు భూతసూక్ష్మ (దేహబీజ) త్రికంబును స్వీకరించిన జీవాత్మకు దివ్యజ్ఞానసమాజపువారు వ్రాసిన పుస్తకములలో "ఆత్మబుద్ధి మనస్కు" డని పేరిడిరి. వీరికే మాండూక్యోపనిషత్తునందు "ప్రాజ్ఞుడు” అని పేరిచ్చిరేమో. బ్రహ్మాండాద్బహిఃప్రదేశమందు అనుపాదకతత్త్వవాసియైన ఈశ్వరాంశమునకు దివ్యజ్ఞానసమాజపు పుస్తకములలో "మోనడ్" అని పేరిడిరి. వాస్తవమైన జీవాత్మ