Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 3]

ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు

45

శరీరముగుండా సంపాదించిన శక్తులన్నియు, స్థూలదేహబీజమునం దిమిడియుండును. మరల జీవాత్మ భూలోకమందు జన్మమెత్తుటకు ప్రయత్మము చేయునపుడు ఇదే దేహబీజమును కైగొని ఆ బీజమునందు ఇమిడియుండు దేహవాసనలనన్నిటినిని వికసింపజేసికొని తదనుగుణమైన శరీరమును కల్పించుకొనును. ఇదేవిధముగా నితర సూక్ష్మాది దేహములను గూడ కలుగ చేసికొనును. దేహబీజములే ఇక ముందు జీవునికి ప్రాప్తించు శుభాశుభవాసనలను నానావిధములైన కర్మఫలములను చూపుచు అనేకజన్మములందు దేహములను ఉత్పత్తిచేయుటకు కారణములై యుండును. ఈ దేహబీజములన్నియు "సూత్రే మణిగణా ఇవ" అనినప్రకారము వరుసగా నొక సూత్రమును ఆశ్రయించి యుండును. సత్యలోకమందు ప్రవృత్తిమార్గయాత్ర నారంభించిన జీవాత్మ దేహబీజసూత్రము వెంబడి నడుచుచు క్రమక్రమముగా దిగువలోకములయందు సంచరించి స్థూలాతిస్థూలమైన భూర్లోకమును చేరి అగడితెలో పడ్డ పిల్లివలె యేమియు చేయలేమిచే గ్రుడ్డివానివలె త్రోవతెలియక భ్రమ చెందియుండును. అంత ఆధిదైవికసృష్టివ్లల్ల వచ్చిన దేవతలు అనేకవేలతరగతులవారు సత్యలోకముమొదలు భూలోకమువరకును అధికారము పొందియుందురు. ఆకాశము మొదలుగాగల తత్త్వములకు అధిష్ఠానదేవతలుగా నుండు ఉన్నత దేవతలకు అనేకవేలలక్షల సహచర, అనుచర, అధికృత, పిల్లదేవత లుందురు. జీవాత్మలు ఆకాశతత్త్వప్రధానమైన సత్యలోకము ప్రవేశించగానే గృహస్థులయిండ్లకు విచ్చేసిన అతిథులు మర్యాదలుపొంది తమ అభీష్టములను స్వీకరించురీతిగా సత్యలోకమును