అధ్యా 3]
ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు
43
యందు ఆకాశగోళము మొదలగునవి ఒకటిలోనొకటి ప్రవేశించి యున్నవని చెప్పబడెను. గనుక సత్యలోకము మొదలు భూలోకమువరకును గల లోకములు కూడ నొకటిలో నొకటి ప్రవేశించి యుండునని జ్ఞాపకపరచవలసిన అవశ్యము లేకుండినను జ్ఞాపకార్థముగా నిప్పుడు ప్రస్తావము చేయబడెను. మన అనుభవములో భూమిపై ప్రయాణముచేయువాడు నడుచుటవల్లనో, బండ్లు ఎక్కుటవల్లనో యేవిధముగా నొక యూరు విడిచి మరియొక యూరికి ప్రయాణము చేయునో, సముద్రమందు (నీటియందు) ప్రయాణము చేయువాడు ఓడలు ఎక్కి ప్రయాణము చేయునో, ఆకాశమందు ప్రయాణము చేయువాడు ఱెక్కలు గట్టుకొనియైనను లేక విమానములనెక్కి యైనను ప్రయాణము చేయునో అదేవిధముగా జీవాత్మకూడ, ఆకాశతత్త్వ ప్రధానమైన లోకము (సత్యలోకము) నందు సంచరించుటకు ఆకాశతత్త్వప్రధానమైన శరీరమును సంపాదించుకోవలెను. అదేవిధముగా వాయుతత్త్వప్రధానమైన లోకము (తపోలోకము, జనలోకము) లయందు సంచరించ నుద్దేశించినపుడు వాయుతత్వప్రధానమైన శరీరమును సంపాదించుకోవలెను. ఇదేప్రకారము వరుసను తేజస్తత్త్వప్రధాన మైన శరీరము నొకటిని, అప్తత్త్వప్రధానమైన శరీరము నొకటిని, పృథివీతత్త్వప్రధానమైన శరీరమొకటిని అనగా ఐదు విధములైన శరీరములను సంపాదించుకోవలెనని ప్రయత్నము చేయును. వేదాంత గ్రంథములందు ఆత్మ పంచకోశవిలక్షణుడు అనియు దేహత్రయ విలక్షణుడు అనియును చెప్పుట సంప్రదాయము. కోశములు అనగా సంచులు. దేహము లనగా చేతులు, కాళ్లు, తల, ముక్కు,