Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

ఆత్మవిచారము

[3 వ

ప్రకృతిచేత బద్ధుడై తన నిజస్వభావమును జీవాత్మ మరిచిన స్థితికి ప్రవృత్తిమార్గయాత్ర యని పేరు.

యాత్రపోవువారు యాత్ర నారంభించు ముందు తాము ఏదేశమందు యాత్రచేయదలచుకొన్నారో ఆ దేశముయొక్క వివరములను విచారించి తెలిసికొనునది ఆవశ్యకము. ఆ ప్రకారము మనము జీవాత్మగారు యాత్రచేయతలచుకొన్న దేశముయొక్క వివరమును కొంత విచారింతము. యాత్రదేశము సత్యలోకము మొదలు భూలోకము వరకును గల ప్రదేశము. ఏడులోకములును పంచభూతములు పంచీకరించినందున కలిగిన ప్రపంచముయొక్క భాగములు. గనుక ఏడులోకములను పంచభూతములకు పంచిపెట్టి చూడవలయును. ఏడు లోకములలో-

సత్యలోకము ఆకాశతత్త్వ ప్రధానము.
తపోలోకము, జనలోకము. వాయుతత్త్వ ప్రధానము.
మహర్లోకము, స్వర్గలోకము తేజస్తత్త్వ ప్రధానము.
భువర్లోకము అప్తత్త్వ ప్రధానము.
భూలోకము పృథివీతత్త్వ ప్రధానము.

అని ఐదు తత్త్వములును ఏడు లోకములుగా పరిణమించియున్నవి. ఈ విధముగా, బహుప్రకారముగా స్థూలాతిస్థూల, స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమము లైన ప్రకృతులతో నిండిన లోకములయందు ప్రయాణము చేయనుద్దేశించిన జీవాత్మ ఆయాలోకములలో తన వ్యవహారార్ధముగా నొక్కొక్క శరీరమును సంపాదించుకోవలసియుండును. ఇంతకుముందు 25 వ పుట