అధ్యా 3]
ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు
41
"జీవాత్మా తు బ్రహ్మణః శరీరతయా ప్రకారత్వాత్ బ్రహ్మాత్మకః” “యస్యాత్మా శరీరం" ఇతి శ్రుత్యంతరాత్.
దీనినే శరీరశరీరిభావము అందురు. జీవాత్మపరమాత్మలకు ఎంత అత్యద్భుతసంబంధముండినను మన బ్రహ్మాండములో ప్రవేశించి యీ బ్రహ్మాండముయొక్క రహస్యములు అన్నియు తామెరుగవలెనని యిచ్ఛయించిన జీవాత్మలకు ఈ బ్రహ్మాండముయొక్క రహస్యములు ముఖ్యముగా భూలోకమందు ప్రారంభించి క్రమక్రమముగా "భ్రామ్యతే బ్రహ్మచక్రే" అనినట్టు పరిభ్రమణము చేయు సందర్భమునందు ప్రతిలోకముయొక్క రహస్యములనును తెలిసికొనుటకు సందర్భము కలుగును. కనుక జీవాత్మయొక్క సంసారచక్రయాత్రను సత్యలోకమునుండి భూలోకమునకును మరల భూలోకమునుండి సత్యలోకమునకు అను రెండు తెఱగులగా జ్ఞానులు వర్ణించియున్నారు. సత్యలోకమునుండి భూలోకమునకు ప్రకృతివల్ల బంధింపబడు యాత్రకు ప్రవృత్తిమార్గ మనియును భూలోకసుఖానుభవములు అన్నియు ననుభవించి విసికిన పిమ్మట మరియు భూలోకమునుండి సత్యలోకప్రయాణ మారంభించు యాత్రకు నివృత్తిమార్గము అనియును పేళ్లు పెట్టిరి. ఈ రెండు మార్గములపైకి మనకు ప్రకృతమందు
ప్రవృత్తిమార్గము.
ను గురించిన విచారము అవశ్యము. ప్రవృత్తి యనగా ప్రవేశము. తాను ఉండిన లోకముయొక్క ప్రకృతిపరిణామమునకన్న స్థూలమైన ప్రకృతులతో నేర్పడిన లోకములలో ప్రవేశించి ఆ స్థూల