40
ఆత్మవిచారము
[3 వ
బ్రహ్మాండమునందు సప్తలోకములు సప్తతలములు ఉన్న వని ముందే చెప్పబడినది. ఈ బ్రహ్మాండమునకు వెలుపల వైకుంఠము గోలోకము అను లోకములు ఉన్నవి అని కూడ చెప్పబడినది. అనేక బ్రహ్మాండములకు అధిపతి గనుక సచ్చిదానందమూర్తి మన బ్రహ్మాండమునకు వెలుపలనే యుండవలెను. అట్టి నచ్చిదానందమూర్తియొక్క అంశలు అయిన జీవాత్మలు కూడ మొదట మన బ్రహ్మాండమునకు వెలుపల యెక్కడనో ఉండవలెను. ఈ ప్రకారము మన బ్రహ్మాండమునకు వెలుపల నుండు జీవాత్మసంఘములు మన బ్రహ్మాండములో ప్రవేశించి యిచ్చటి అనుభవములను అనుభవించి తద్వారా అనుభవపరులై తమ జన్యస్థానమైన సచ్చిదానందమూర్తివలె విజృభించవలెను అని ఆశ గొనిరి. అంశలు, కిరణములు అను పదములతో మహారహస్యమైన జీవాత్మ పరమాత్మల సంబంధమును తెలియపరచిరి గాని మనయొక్క మనస్సులకు అవగాహన అగునట్టు వేరు విధముగా చెప్పను సాధ్యముకాదు. శరీరము అనునది లేని సచ్చిదానందమూర్తికి జీవాత్మల సమూహములు శరీరము అని శాస్త్రములలో చెప్పియున్నది. పరమాత్మయొక్క శరీరములో జీవాత్మలందరును అణువులవలె ఇమిడియున్నారు అనియు చెప్పబడియున్నది. మన బ్రహ్మాండమునకు వెలుపల గల స్థితిని తెలిసికొనుట అసాధ్యము గనుక తమ తమ దృష్టికి గోచరమైనట్టు తపోధనులైన పెద్దలు జీవాత్మ పరమాత్మల సంబంధమును వర్ణించిరి.
వేదార్థసంగ్రహము అను గ్రంథమునందు గ్రంథకర్తయగు శ్రీరామానుజాచార్యులను మహానుభావులు చెప్పినది ఏమనగా