Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 3]

ఆధిభౌతిక ఆధిదైవిక ఆధ్యాత్మిక సృష్టులు

37

గవతమందు కారణసృష్టియనియును కార్యసృష్టియనియును విమర్శించి ప్రాకృతసృష్టి, వైకృతసృష్టి యను మొదలగు భేదములతో వివరించియున్నారు. దేవీభాగవతమునందును విష్ణుపురాణమునందును గూఢార్థముగా నీ త్రివిధసృష్టులను చెప్పియున్నది. ఉపనిషత్తులలో చెప్పియుండు సంగతులు బహుగూఢములు. సంప్రదాయానుసారముగా నుపనిషత్తులను పఠించి సమన్వయపరచుకొనినవారలకు గాక మిగిలినవారికి అవగాహన అసాధ్యము. మానవశరీరము జీవాత్మరహితమై ఏ సమయమందైనను ఉండుట సాధ్యము కాదని కొందరు పండితులు వాదించినపుడు వినియున్నాము. ఇది పండితుల తప్పు కాదు. సనాతనధర్మమతమైన హిందూమతమునందు నాలుగు వేదములు, ఉపవేదములు, షట్‌శాస్త్రములు, పురాణములు, ఆగమములు, తంత్రశాస్త్రములు బహు బాహుళ్యముగా నున్నవి. ఆయావేదములకు సంబంధపడిన ఉపనిషత్తులును ఉన్నవి. ఇన్నియు ఆత్మవిద్యకు అవశ్యము. ఇన్నిటిని అధ్యయనముచేసి వానియర్థములను గ్రహించినగాని యేదైన నొక విషయము యొక్క రహస్యము సమగ్రముగా తెలియదు. ఇన్ని శాస్త్రములను, వేదములను, అధ్యయనముచేయను మాత్రము ఒక పురుషాయుస్సు చాలదు. ఇక వాని యర్థములను విచారించిరా, అసాధ్యము. లెక్కలేనన్ని పురాణము లున్నవి. అవి అన్ననో మహారహస్యములను తమ గర్భమందుంచుకొని యున్నవి. కనుక వేరు వేరు శాస్త్రములయొక్క సారాంశములను తెలిసికొనిన అనేకమంది పండితుల సమూహములలోనే గాని రహస్య విషయములను గురించిన. జ్ఞానము లభించదు. ఇందుకనే పూర్వ