Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 2]

ఉపక్రమము.

33

బ్రహ్మాండముకన్న పెద్దది. ఈ వచనములు పరమాత్మకును జీవాత్మకును స్వభావతః సామ్యమును తెలుపుచున్నవి.

జీవాత్మను గురించి చెప్పునప్పుడు వేదాంతగ్రంథములలో "అంతఃకరణే చిత్ ప్రతిబింబో జీవః" అని చెప్పియున్నది. ఇందు వలన మన మెరుగవలసినదేమనగా అంతఃకరణము ఏమాత్రము శుద్ధముగానున్నదో జీవాత్మ ఆమాత్రము ప్రజ్ఞావంతముగా నుండును. "ప్రాణైశ్చిత్తం ఓతం ప్రజానాం తస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా" అని ముండకోపనిషత్తునందు చెప్పియున్నది. సాధారణముగా జనసమూహముయొక్క అంతఃకరణము ఇంద్రియవ్యాపారము చేత మూయబడియున్నది. ఏమాత్రము అంతఃకరణము శుద్ధమో ఆ మాత్రము జీవాత్మయొక్క విభవము వెలియగునని యర్ధము.

"బహుస్యాం" అని కాంక్షించిన సచ్చిదానందమూర్తి యొక్క సంకల్పము సిద్ధించవలెననియుంటే వారియంశలైన జీవాత్మలగు మన మందరమును మన మన యంతఃకరణములలో చేరియుండు మలమును పోగొట్టుకొని మన యంతఃకరణములను పరిపక్వము చేసికొని ప్రకృతమందు మనలకు బంధముగానుండు అంతఃకరణమును నిజమైన కరణము (ఆయుధము) గా చేసికొనవలయును. ఇదే సచ్చిదానందమూర్తిగారి యభిప్రాయము.

ఇందువలననే వారు "ప్రజాయేయ" యని అనుకొనిరి. “ప్రజాయేయ” యనగా నేను జన్మముల నెత్తుదునుగాక యని యర్థము.

క్రీడారంగమైన జగత్తుయొక్కయు క్రీడకుడైన జీవాత్మయొక్కయు ఉద్భవమును సంగ్రహముగా విచారించితిమి. ఇక "ప్రజా