32
ఆత్మవిచారము
[2 వ
స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకము కాడు. అయితే ఏయే శరీరములను అంగీకరించునో ఆయాశరీరములయొక్క లింగముల వల్ల వ్యవహరింపబడును.
పురుష దేహమునందు ప్రవేశించినపుడు పురుషుడు, స్త్రీ దేహమునందు ప్రవేశించినపుడు స్త్రీయని వ్యవహరింపబడు. ఒక జన్మమునందు పురుషనామము, అనగా "శ్రీనివాసవరదవేంకట లక్ష్మీనృసింహతాతా చార్యులవారు” అనియును మరియొక జన్మమందు "తాయారమ్మగారు” "అల్లీసాయబు" అనియు పేళ్లతో పిలువబడును. గాని దేహములయందు ప్రవేశించిన జీవాత్మకు ఇహలోకపు పేళ్లు ఏదియును గావు.
ఈశ్వరుడు అను సచ్చిదానందమూర్తిని ఉపనిషత్తు వర్ణించు విధము:-
బృహచ్చ తద్దివ్యమనంతరూపం సూక్ష్మాచ్చ తత్సూక్ష్మతరం విభాతి ॥
(ముండకోపనిషత్)
ఆ వస్తువు చాల గొప్పది. అదే వస్తువు సూక్ష్మములకన్న నతి సూక్ష్మము. జీవాత్మను గురించియు ఉపనిషత్తు వర్ణించువిధము: -
పాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య చ ।
భాగో జీవస్సవిజ్ఞేయః సచానంతాయ కల్పతే ॥
(శ్వేతాశ్వతరోపనిషత్)
దేహధారియైన జీవాత్మయొక్క రూపము అతిసూక్ష్మము. ఒక వెంట్రుక కొనయొక్క నూరింట నొకభాగములో మరల నూరింట నొకభాగమువలె సూక్ష్మము. మరియు నదే మిక్కిలి (అనంతమైన)