Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 2]

ఉపక్రమము.

31

మూర్తులు కావలసినవారే అని నిశ్చయము. ముండకోపనిషద్వాక్యము అయిన, "యథా సుదీప్తాత్పావకాద్వి స్ఫులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః । తథా౽క్షరాద్వివిధా: సోమ్యభావాః ప్రజాయంతే” అను వాక్యమునందలి అర్థము - మహాప్రకాశముతో వెలుగుచున్న దనదహనంబునుండి వేలకొలది గల మిణుగురులు ఏవిధమున బయులు వెడలునో, ఏవిధముగా ప్రతిమిణుగురును తనయొక్క జన్యస్థానమైన దావాగ్నికి నున్న శక్తులనన్నిటిని కలిగియుండునో అట్టి మిణుగురు స్వల్పమైనను తనయొక్కవృద్ధికి అనుకూలములయిన వరిగడ్డి మొదలగు పదార్థములలో పడినట్టైతే క్రమక్రమముగా వృద్ధిచెంది తన జన్యస్థానమైన దావాగ్ని వలె అగుటకు సాధ్యమో అదేప్రకారము ఈశ్వరునిలోని సమస్త శక్తులనును కాలక్రమమున జీవాత్మకూడ పొందగలడు. ఈ చర్యకే మోక్షప్రాప్తియని పేరు. మోక్షమనగా విడదల; బంధనిర్ముక్తి. కనుక స్వస్వరూపోపలబ్ధి. స్వస్వరూపమనగా నీశ్వరస్వరూపము. అనగా, సచ్చిదానందమూర్తివలె పూర్ణుడు అవుట. వ్యవహారమందు ఏమైనప్పటికిని బంధముల బడియున్న జీవాత్మకును పరమాత్మకును స్వభావసామ్యమును మరువ కూడదు.

పరమాత్మకు లింగభేదములు లేవు. అనగా పురుషుడు కాడు. స్త్రీయును కాడు. నపుంసకమును కాడు. అదేవిధమున జీవాత్మకు కూడ లింగభేదములు లేవు.


సైవస్త్రీ నపుమానేషో సైవచాయం నపుంసకః ।
యద్యచ్ఛరీరమాదత్తే తేనతేన సయుజ్యతే॥

(శ్వేతాశ్వతరోపనిషత్తు)