Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా. 2]

ఉపక్రమము.

29

ఈ అమృతవస్తువు సత్యముచేత మూయబడినది. జీవాత్మ అమృతము. నామరూపములు సత్యములు. అనగా నామరూపములు పరమాత్మను కానరాక చేసినవి అని అర్థము. ఇందుకుదాహరణము : ఏపి మ్రానితో కొన్నిబొమ్మలను చేసి, తరిమెనపెట్టి, ఆ బొమ్మలకు రాముడు లక్ష్మణుడు అని పేళ్లుపెట్టి విక్రయమునకుగా బహిరంగమైన స్థలమునందు ఒకడుంచియుండునపుడు ఆ వీధివెంబడి పోవువారలు ఆ బొమ్మలను చూచి ఇది రాముడట ఇది లక్ష్మణుడట, ఈ రామలక్ష్మణులు ఎంత ముద్దుగా నున్నారు చూడుడు, అని ఒకరితోనొకరు ముచ్చటించు కొనుచుందురు కదా. ఎవరైనను ఏపిమ్రాను ఎంత చేవయెక్కిన తునక. ఎంత బాగావున్నది. ఇది ఎన్ని ఏండ్లు పెరిగి ముదిరి చేవయెక్కిన మ్రాను అని ముచ్చటించారు కదా. బాటసారులయొక్క ముచ్చట యందలి సారాంశమేమన రాముడు అను నామమును ఆ రూపమును ఏపిమ్రాను అను మ్రానియొక్క ప్రస్తాపమును కప్పినది గదా. ఎవరికైనను సకృత్తుగా నొకరికి తప్ప జనసమూహమునకు ఏపి మ్రానితునక అగపడ లేదు. బహుమందికి రామనామమును రామవిగ్రహరూపమును మాత్రమే గదా కనబడినవి. ఇదే అర్థము ఈ పైవ్రాసియుండు "తదేతదమృతగ్ సత్యేన ఛన్నం” అను బృహదారణ్యకోపనిషద్వాక్యముయొక్క అభిప్రాయము. ఈ అర్థమును ఉపనిషత్తులలో "యథా సోమ్యైకేన మృత్పిండేన విజ్ఞా తేన సర్వం మృణ్మయం విజ్ఞాతం స్యాత్ వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం" అను వచనములలో సూచించిరి. మనము ఉండు భౌతికప్రపంచమందు జీవాత్మగా