28
ఆత్మవిచారము
[2 వ
నది. ఇంతటి మర్యాదకు అర్హుడైన జీవాత్మ అను క్రీడకుడు ఎవ్వడని విచారింతము. ఛాందోగ్యోపనిషత్తు షష్ఠప్రపాఠకము ద్వితీయ ఖండమునందు ఈ "బహుస్యాం" అను వాక్యమును “ ప్రజాయేయ” యను వాక్యమును ఉన్నవని యిదివరకే ప్రస్తాపించియుంటిమి గదా. అదే ఖండమునందు, తేజస్సు, అప్పు, అన్నము అనునవి ఆ పరమపురుషునివల్ల సృజింపబడినవనియును తృతీయఖండము నందు ఆ మూడు భూతములును త్రివృత్కరణమైనవనియు అండజం, జీవజం, ఉద్భిజ్జం అను బీజములకు త్రివృత్కరణము చెందిన తేజః అప్ అన్నం సృష్టికారణములైనవనియు చెప్పియున్నది.
సేయం దేవతైక్షత హస్తహ మిమా స్తి స్రో దేసతా అనేన జీవే నాత్మ నానుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణీతి.
అపుడు "బహుస్యాం" అనిన దేవుడు తేజోభిన్నములను చూచి నేను జీవాత్మరూపముగా నామరూపములను అవలంబించి ఈ తత్త్వములలో ప్రవేశించెదను అని చెప్పిరి అని అర్థము. కనుక జీవాత్మ అను శబ్దమునకు నామరూపాన్వితమైన పరమాత్మయని యర్థము. నామరూపములు లేనిది పరమాత్మ. అదే పరమాత్మకు నామరూపములు సంబంధించినవుడు జీవాత్మయని పేరు అని ఛాందోగ్యోపనిషత్తుయొక్క అభిప్రాయము. అనగా పరమాత్మ అను వస్తువును మూసిపెట్టినవి నామరూపములు.
తదేతదమృతగ్ సత్యేన ఛన్నం, ప్రాణోవా అమృతం, నామరూపే సత్యం, తాభ్యా మయం ప్రాణ శ్ఛన్నః!
బృహదారణ్యకం ప్రథమాధ్యాయం షష్ఠబ్రాహ్మణం.