అధ్యా. 2]
ఉపక్రమము.
27
తత ఊర్ధ్వం చ వైకుంఠో బ్రహ్మాండా ద్బహిరేవ సః ।
తత ఊర్థ్వంచ గోలోకః ..................॥ (దేవీ భాగవతము)
బ్రహ్మ, విష్ణువు, శంభుడును, సూర్యుడును, చంద్రుడును, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని అనుసప్తగ్రహములును వారి వారి లోకములును చేరి మనయొక్క ఒక బ్రహ్మాండమయినది. ఇట్టి బ్రహ్మాండములు అనేకములు గలవు. ఇందును గురించియు బ్రహ్మాండము అను అధ్యాయమునందు కొన్ని వివరములు వ్రాయబడును.
ఇతర బ్రహ్మాండములలో ఎట్లున్నను మనబ్రహ్మాండము నందు అధికారముపొందిన త్రిమూర్తులలో బ్రహ్మకు ఆధిభౌతికసృష్టికి అధికారము. విష్ణువునకు ఆధిదైవికసృష్టికి అధికారము. శంభునికి ఆధ్యాత్మిక సృష్టికి అధికారము. అధిభౌతికము అని పేరుగల భూతసృష్టి అయిన తర్వాత ఆధిదైవసృష్టి అయినది. తన్మాత్రలకు, తత్త్వములకు, లోకములకు, ఇంద్రియములకు, మనస్సు మొదలగు అంతఃకరణమునకు, అంతఃకరణముయొక్క పరిణామము లైన ఇచ్ఛా, ద్వేషము, సుఖము, దుఃఖము అను వానికిని, పంచ ప్రాణములకు, ఉపప్రాణములకు, అన్నిటికిని అధిష్ఠానదేవతలు సృష్టింపబడిరి. వారు వారు వారి వారి ఉద్యోగములలో ప్రవేశించిరి. అధిష్ఠానదేవతల వివరముకూడ బ్రహాండము అను అధ్యాయమునందు వ్రాయబడును.
జీవాత్మ
అయిన క్రీడకుడు విచ్చేసి అతని క్రీడకుగా సిద్ధపరచబడిన క్రీడారంగమును ప్రవేశించుటకుగా సకలమును సిద్ధముచేసి అయి