24
ఆత్మవిచారము
[2 వ
మునకు కారణము. అనగా శబ్దము అను పరిమితి గల స్పందము అదివరకును ఉండిన ప్రకృతిని అప్పటి స్థితికంటె స్థూలముగా చేసినది. ఆ స్థూలత్వమునకు (స్థౌల్యమునకు) ఆకాశతత్త్వము అని పేరు. ఒక ఉదాహరణము నిచ్చి ఈ యర్థమును విశదపరచవచ్చును. ఒకమైలు వర్తుల విస్తీర్ణముగల ఒక తటాకమందు జలమున్నదను కొందము. సూర్యుడు తన కిరణములతోను వాయువు తాను వీచుటచేతను ఒక నెలదినములు ప్రయత్న పడిరనుకొందము. సూర్యకిరణముల వేడిమిచేత తటాకమందుండిన జలము కొంతమట్టుకు ఆవిరిరూపమున పై కెగసిపోయెను. గాలి వీచుటవల్లనును నీరు శోషించిన దనుకొందము. ఒక నెల అయిన తరువాత ఆ తటాకమందుండు నీరు ముందున్నంత పలచనగానుండదు. నెలదినములు సూర్యకిరణముల వేడిమితో నావిరిరూపమున నీరు పోయినందున కొంత మట్టుకు ద్రవత్వము తగ్గి అడుసుకలిసినట్టు కనపడును. మరియును ఒక మైలు వర్తులవిస్తీర్ణముండిన నీరు విస్తీర్ణముతగ్గి ముక్కాలుమైలు వర్తులవిస్తీర్ణమే కలిగియుండును. ఈ విధముగా మరియొక నెలదినములు సూర్యుని తేజస్సును చండమారుతమును పనిచేసినయెడల మరికొంత నీరు తగ్గి పలచనయును విస్తీర్ణమును తగ్గిపోవును. ఇదేవిధముగా శబ్దతన్మాత్రయను స్పందశక్తివల్ల ఆకాశ తత్ + త్వం అను పరిణామము కలిగియుండిన ప్రకృతియందు "స్పర్శ" అను తన్మాత్ర స్పందరూపముగా ప్రవేశించి వాయుతత్త్వము అను మార్పును కలుగచేయును. ఆకాశతత్త్వములోనుండి వాయుతత్త్వము ఉద్భవించినట్టు కదా అర్థము. అందువల్లనే "ఆకాశాద్వాయు:” అని వేదప్రమాణము. ఇదే విధముగా రూప