శ్రీ అల్లాడి మహాదేవశాస్త్రులవారు
"దివ్యజ్ఞానదీపిక" యందు వ్రాసిన గ్రంథవిమర్శ
ఆత్మవిచారము (అద్దంకి సీతారామశాస్త్రి రచితము).
బ్రహ్మవిద్యాసమాజము (Theosophical Society) 1879 సం॥న ఈ దేశమునకు వచ్చినది మొదలు దాని యధ్యక్షులైనవారలు బ్రహ్మవిద్యాప్రచారము చేయుచువచ్చుటచే మనవాండ్లకు హిందూ సనాతనధర్మమున ఆదరము హెచ్చుచు వచ్చినది కదా. అంతకు మునుపు మనలోని విద్యార్థులు గౌరవించుచుండిన పాశ్చాత్య వైజ్ఞానికులు ఆత్మజ్ఞానవిముఖులు కావున వారియనాదరణచే నేమి వారిదూషణములచే నేమి సనాతనధర్మము ఉపేక్షాస్పదమాయె. బ్రహ్మవిద్యాసమాజము నిలకడనొందినపై మహనీయులగు బ్లవాట్స్కి దొరసాని, అల్కాటు దొర, బెసంట్ దొరసాని, లెడ్‌బీటరు దొర మొదలగువారు పాశ్చాత్యవిజ్ఞానమార్గముననే గ్రంథమూలకముగను ఉపన్యాసమూలకముగను బ్రహ్మవిద్యాప్రచారము చేసి సనాతనధర్మ మూలతత్వములను యుక్తియుక్తముగను స్వానుభవపురస్సరముగను ఉపపాదించుటవలన హిందూజనులకు తమ సనాతన ధర్మమున గౌరవము కలిగినది. ఇట్టి ఉపన్యాసములును గ్రంథము