Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

ఆత్మవిచారము

[2 వ

తనకు మరియొక ప్రకృతి కలదని చెప్పినారు. ఆ ప్రకృతి యేదని భగవద్గీత 7 వ యధ్యాయము 5 శ్లోకమునందు వివరించినారు. అది జీవభూతమైన పరాప్రకృతి. ఈ పరాప్రకృతినే సాంఖ్యదర్శనమునందు "పురుషుడు" అందురు. భగవద్గీత 8 వ యధ్యాయమందు చెప్పిన "పురుషశ్చాధిదైవతం” పురుషుడు ఈ పరాప్రకృతే. ఇదే అధిదైవతము. ఈ అధిదైవత ప్రకృతినిగురించి ముందురాబోవు అధ్యాయములలో విపులముగా వ్రాయబడును. అధిభూతమును గీతాశాస్త్రమునందు అచ్చటచ్చటయును క్షరము అని వాడియున్నారు. అధిదైవమును అక్షరము అని కూడ వ్యవహరించియున్నారు. అధిభూతము, క్షరము, అపరాప్రకృతి, యను సంజ్ఞలచే నెరుగగల ప్రకృతికి వ్యక్తి యని పేరు అని ఇదివరకే చెప్పబడినది. అధిదైవము, అక్షరము, పరాప్రకృతి, జీవభూతము, పురుషుడు, అను సంజ్ఞలచే సూచించ బడిన ప్రకృతి అవ్యక్తమని 8 వ యధ్యాయము 2౦ వ శ్లోకమునందు చెప్పబడియున్నది. 9 వ యధ్యాయము 4 వ శ్లోకమునందు "మయా తత మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా" అని చెప్పిన "అవ్యక్తము” పరాప్రకృతియే. 15 వ యధ్యాయము 13 వ శ్లోకమునందు సూచించిన అక్షరపురుషుడును ఈ పరాప్రకృతియే. 1౩ వ యధ్యాయము 19 వ శ్లోకము "పురుషం ప్రకృతిం చైవ విద్ధ్యనాదీ ఉభావపి" లో చెప్పినపురుషుడును ఈ పరాప్రకృతియే. 8 వ అధ్యాయము 18 వ శ్లోకమునందు "అవ్యక్తము” అని పరాప్రకృతిని గురించియు, "వ్యక్తయః" అని అపరాప్రకృతిని గురించియు చెప్పిరి. 15 వ యధ్యాయము -