విజ్ఞాపన
339
ప్రవృత్తిమార్గముయొక్క అంత్యస్థితియు నివృత్తిమార్గముయొక్క ఆదిమస్థితియు కొంచెము ఎక్కువతక్కువగా తుల్యములుగానుండును. నివృత్తిమార్గమును నడువను ఆరంభించునపుడు కొంచెము కొంచెముగా ఐహికసుఖములయందు పట్టుదల వదులుచు వచ్చును. శాస్త్రములను వినవలెనను అభిలాషపుట్టును; ఈ అభిలాషయొక్క ఫలితార్థముగా శ్రవణము అనుపదవిని చెందుటకు సిద్ధపడుదురు. శ్రవణము అను చర్యయందు చెప్పువారొకరు, వినువారొకరు ఉండవలెను. చెప్పువారికి వక్తయని పేరు. వారే గురువులవారు. వినువారికి శ్రోతయని పేరు. వీరే శిష్యులు. నివృత్తిమార్గమునందు నడువనారంభించువాడు గురువులవారిని ఆశ్రయించి శ్రవణముచేసి వినినవాక్యములను మననముచేసి శ్రవణమననములయొక్క ఫలితార్థమును నిదిధ్యాసము చేయ నారంభించవలయును. ఈ పుస్తకములో చెప్పిన విషయములను జాగ్రతగా చదివి మననము చేసి శీలమును కుదుర్చుకొనవలయును. ఈ పుస్తకముయొక్క ఉత్తరభాగమునందు 1. సాధన చతుష్టయసంపత్తి, 2. జీవన్ముక్తులు (గురువులు) 3. దేహములు, వాని సౌష్ఠవము, 4. శ్రవణమననములు, 5. యోగంగములు (కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము), 6. ధ్యానము, 7. కైంకర్యము, 8. జ్ఞానదీక్షలు, 9. ప్రయోజనము అను అధ్యాయములయందు యథాశక్తిగానును యథోచితముగానును కొన్నివివరములు వ్రాయవలయునని యుద్దేశము. ఐతే ప్రకృతమందు ఈ పుస్తకముయొక్క పూర్వభాగమును మాత్రము ముగించి ప్రచురించు అభిప్రాయమున్నది. ఇందు కనుపరిచిన విష