334
ఆత్మవిచారము
[8 వ
అయ్యా, తమవంటి భక్తులే తీర్థములు అనదగు. తమరు పునీతులు కావలెననియా తాము తీర్థములయందు స్నానముచేతురు ; కాదు, కాదు. తమయొక్క హృదయకమలమునందు తేజరిల్లుచున్న గదాధరుండైన శ్రీవిష్ణువుయొక్క శక్తిని తీర్థములకియ్యవలెను అను నుద్దేశముతో తీర్థయాత్రచేసి ఆ తీర్థములయందు స్నానముచేయుసందర్భమునందు వానికి వీర్యమునిత్తురు గదా అని యర్థము. ఇది నిజమైన సంగతి. భగవద్భక్తులు సదా శుచిష్మంతులు. గంగాదితీర్థములు తమయందు స్నానములుచేయు పాపాత్ముల పాపములను కడిగి కడిగి వానియందలి వీర్యము తక్కువ యగుచుండగా సాధువులు ఆతీర్థములయందు స్నానముచేయువ్యాజముతో స్నానకాలమందు తమయందిమిడియుండు భగవద్వీర్యమును తీర్థములలో నెక్కించి బలపరుచుచుందురు. కనుకనే సాధువులు తీర్థములను తీర్థీకరించువారు అని ప్రవచనము.
తత్రోపజగ్ము ర్భువనంపునానా మహానుభావా మునయ స్సశిష్యాః ।
ప్రాయేణ తీర్థాభిగమాపదేశై స్స్వయం హి తీర్ధాని పునంతి సంతః ॥
(శ్రీభా - స్క౦-1, అధ్యా-19.)
లోకమును శుద్ధిచేయునుద్దేశముతో తమతమశిష్యులతోకూడ మహానుభావులైన మునులు అచ్చటికి దయచేసిరి. తాము కృతార్థులైనను లోకులను అనుగ్రహించవలెను అను కటాక్షముచేత ప్రేరితులై తాము తీర్థయాత్రచేయవలెను అని యితరులకు కనుపరిచినట్టు తీర్థములయందు స్నానములుచేయుచు ఆ తీర్ధములను శుచిష్మంతములుగా చేయుదురు. కనుకనే