Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

330

ఆత్మవిచారము

[8 వ

రక్తియు, ఆసక్తియు, అనంతరము భక్తియు కలుగును. తద్వారా అవిద్యానాశమగును. భక్తిగల పురుషుడు నా కథాశ్రవణము చేయుటవలన నా లీలను చింతించి చింతించి ఐహికవిషయముల యందు ఆసక్తిని క్రమముగావదులుచు అదే విధమున ఆముష్మిక సుఖములయందుకూడ ఆశవదిలి నిస్పృహుడై పరమపావనంబైన యోగమార్గమును అభ్యసించుట కారంభించును. తద్వారా నన్ను పొందును.

కాబట్టి, ఉద్ధవా, బుద్ధిమంతుడు దుస్సంగమును చాలించి సత్సంగమునే కోరవలయును. సాధువులు తమనాశ్రయించినవారి యొక్క మనస్సులయందు గల చింతలను మంచిమాటలతో దొలగింతురు. సత్పురుషులు లేక సాధువు లెవరనిన, అనపేక్షులు అనగా సుఖములయందు అపేక్షలేనివారు, మచ్చిత్తులు,[1] ప్రశాంతులు, సమదర్శనులు,[2] నిర్మములు,[3] నిరహంకారులు,[4] నిర్ద్వంద్వులు,[5] నిష్పరిగ్రహులు నగువారు. సాధువులు నా మాహాత్మ్యమును కీర్తించుచుందురు. అట్టి కీర్తనమువలన సేవించువారికి పాపపరిహారమగును. సేవించువారు సాధువులు కీర్తించు కథలను ఆదరముతో వినినను, కీర్తించినను, అనుమోదించినను, శ్రద్ధావంతులై నాయందు స్నేహమును వృద్ధిచేసికొనినవారై నాభక్తు

  1. భ. గీ. 10-ఆధ్యా. 9 శ్లో.
  2. భ. గీ. 6-అధ్యా. 32 శ్లో, 13-అధ్యా. 28 శ్లో, 12-అధ్యా, 18 శ్లో, 18-అధ్యా. 54 శ్లో, 4-అధ్యా. 22 శ్లో.
  3. భ. గీ. 12-అధ్యా. 1౩ శ్లో.
  4. భ. గీ. 12-అధ్యా. 1౩ శ్లో.
  5. భ. గీ. 2-ఆధ్యా. 45 శ్లో, 5-అధ్యా. 3 శ్లో, 3-అధ్యా. 27 శ్లో, 4-ఆధ్యా· 22 శ్లో, 15-ఆధ్యా 5 శ్లో.