Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

ఆత్మవిచారము

[8 వ

ఈ శ్లోకముయొక్క తాత్పర్యముకూడ హరిహరభేదములేదనియే. శాస్త్రములయందు శివవిష్ణుభేదము ఎంతమాత్రమైననులేదు. విష్ణుసహస్రనామావళియందు శివాయనమః, శర్వాయనమః, శంభ వేనమః, ఈశానాయనమః, మహాదేవాయనమః, ఖండపరశవే నమః అను మొదలగు శివనామములును, శివసహస్రనామావళి యందు అనంతాయనమః, కృష్ణాయనమః, విష్వక్సేనాయనమః, సుదర్శనాయనమః, పద్మనాభాయనమః, విష్ణవేనమః అను మొదలగు విష్ణునామములును కలిసియున్నవి. హరిహరభేదము లేదనుటకు ఇది ఋజువు.


మద్భక్తః శంకరద్వేషీ మద్వేషీ శంకరప్రియః ।
తా వుభౌ నరకం యాతో యావచ్చంద్రదివాకరౌ ॥

(పురాణవచనము)


ఇట్లు అనేక గమకములవల్ల తెలియతగునది యేమనగా భక్తులయొక్క శ్రేయస్సుకుగా శివవిష్ణురూపములలో నొకటిని భక్తులంగీకరించినను అంగీకరించని మూర్తిపైన మర్యాద తగ్గకూడదు.


మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతరాత్మని ।
న వస్తుభేదప్రతిపత్తి రస్తి మే తథాపి భక్తి స్తరుణేందుశేఖరే ॥


లోకములకంతయు నాథుడైన మహేశ్వరునియందును జగత్తున కెల్లయు నంతరాత్మయైన జనార్దనునియందును నాకు సమానమైన ప్రేమాదరపూర్వకసమత్వ ముండినను నాకు భక్తితరుణేందు శేఖరుడైన మహాదేవునియందు అని మాత్రము ఒక్కరు చెప్పుకోవచ్చును. కనుక విష్ణుభక్తులు శివదూషణ చేయరు; శివభక్తులు