Jump to content

పుట:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf/341

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యా 8]

శీలము

321

ఎపుడైనను ఇతరుల తప్పులనుగురించి మనము మాటలాడ కూడదు. అందువల్ల తప్పులుచేసిన వారలకును మనకును చెడుపు కలుగును. తప్పులుచేసినవారికి ఏ విధముగా చెడుపు వచ్చుననగా, మనయొక్క హాస్యతలంపులు వారలను చేరి మరియును తప్పులు చేయునట్టు చేయును. అందువల్ల వారలకు చెడుపు. వారలయొక్క మేలు కోరినవారమైతే మనము వారలయందు ఉండు గుణములన్నియు మంచివికావలెనని సర్వదా భగవంతుని ప్రార్థించుచురావలెను. మనకు ఏ విధముగా చెడుపుకలుగుననగా తప్పులను తలచినపుడు తప్పుల స్పందములు మనయందు ఆ తప్పులుకలుగచేయుశక్తిగల అణువులను చేర్చును. ఆ యణువులు మనయందు చేరినందువలన కొన్నాళ్లకు ఇతరులయందున్నవని మనము హాస్యయముచేసిన తప్పులను మనమే చేయునట్టు ఏర్పడును. ఇవన్నియు శీలమును చెరుచును. 'బ్రహ్మావలోకధిషణులై' మానవశరీరధారులైన మనము ఉత్తరోత్తర వృద్ధిని ఎదురుచూచుచు సదా జాగరూకులమై శీలమును వృద్ధిచేసికొనుచుండవలెను.

ఈ అధ్యాయప్రారంభమునందు అచ్చుపడియుండు శ్లోకముయొక్క అర్థమును కొంత విచారించవలెను.

సుశీలాన్‌ అనగా మంచిశీలముగలవారలు అని యర్ధము. శీలము అనగా మంచినడత, సుశీలము అనగా సాధారణ "మంచి" కంటె నధికమైన "మంచి”. మంచి కంటెనధికమంచి యనగా నధికతరమైన మంచినడక యని యర్థము.

సదాచారనిష్ఠాన్‌ అనగా నెల్లపుడును మంచి ఆచారము గలవారు, లేక ఎల్లపుడును ఆచారముగలవారు, లేక సద్వస్తువు